Most Trolled First Looks : ఒక సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి దానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను ముందుగా రిలీజ్ చేస్తుంటారు. ఈ లుక్ తోనే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడానికి మేకర్స్ డిఫరెంట్ లుక్స్ తో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. గత మూడు నెలలుగా అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె కు సంబంధించిన పోస్టర్లను ప్రేక్షకుల ముందు ఉంచారు. అయితే వీటిపై నెటిజనర్లు రకరకాల ట్రోలింగ్ చేశారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే పోస్టర్ గురించి అయితే ఏదో మిషన్ కు ప్రభాస్ తల పెట్టినట్లుంది అని అన్నారు. మిగతా పోస్టర్ల గురించి నెటిజన్లు ఎలాంటి కామెంట్లు ట్రోలింగ్ చేశారో చూద్దాం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటేస్టుగా నటిస్తున్న మూవీ పుష్ప-2. పుష్ప పార్ట్ 1 కు సీక్వెల్ గా దీనిని తీస్తున్నారు. ఫస్ట్ మూవీలో బన్నీ ఊరమాస్ లుక్ లో కనిపించాడు. కానీ లేటేస్ట్ మూవాలో గెటప్ కాస్త చేంజ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి అమ్మవారి గెటప్ లో ఉన్న ఓ పిక్ ను రిలీజ్ చేశారు. దీనిని గత ఏప్రిల్ లో బయటకు తెచ్చారు. ఈ పిక్ చూడగానే ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.అయితే కొందరు నెటిజన్లు ఈ లుక్ అదరిపోయిందని, అయితే అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ని చూడలేమని కామెంట్ చేశారు.
సూపర్ స్టార్ మహష్ బాబు వరుసబెట్టి మాస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. లేటేస్టుగా త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే 31న రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ రెడ్ షర్ట్ వేసుకొని, నోట్లో బీడీతో కనిపించాడు. క్లాస్ అండ్ మాస్ ను చూపిస్తున్న ఈ పిక్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.
పవన్ కల్యాణ్, సముద్రఖని కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘బ్రో’. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పవన్ లుక్ ను జూన్ 27న రిలీజ్ చేశారు. ఇందులో పవన్ స్టైలిష్ గా కనిపించాడు. పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఇందులో కనిపించాడు. దీంతో ఈ మూవీ క్లాస్ తో పాటు మాస్ టచ్ కూడా ఇస్తుందని అంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కె. లేటస్టుగా దీనికి ‘కల్కి 2898 ఏడి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. జూలై 20న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ను చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ గెటప్ లో ప్రభాస్ షూట్ కాలేదని కొందరు విమర్శించారు. కానీ స్టోరికి తగ్గట్టు ఆమాత్రం గెటప్ ఉండకపోతే ఎలా అని ఫ్యాన్స రిప్లై ఇస్తున్నారు.