https://oktelugu.com/

Krishna Vamsi-Venkatesh: కృష్ణవంశీ, వెంకటేష్ కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

కృష్ణవంశీ, వెంకటేష్ లా కాంబో.. నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత కృష్ణవంశీ వెంకటేష్ తో సినిమా చేయాల్సింది దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా తను రెడీ చేసుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 21, 2024 / 03:37 PM IST
    Follow us on

    Krishna Vamsi-Venkatesh: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకి మంచి గుర్తింపు ఉంటుంది. ఒకసారి ఒక డైరెక్టర్, ఒక హీరో కలిసి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు అంటే వాళ్ళ కాంబినేషన్లో మరొక సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ చాలా కాంబినేషన్లకు మంచి గుర్తింపు అయితే ఉంది. అందులో కొన్ని కమ్యూనిషన్ల ల్లో సినిమాలు రాకపోయినా కూడా వాళ్ళ కాంబో లో ఎప్పుడు సినిమా వస్తుంది అంటూ అభిమానులు ఎదురుచూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

    అలాంటి కాంబోనే కృష్ణవంశీ, వెంకటేష్ లా కాంబో.. నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత కృష్ణవంశీ వెంకటేష్ తో సినిమా చేయాల్సింది దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా తను రెడీ చేసుకున్నాడు. కానీ అప్పుడు వెంకటేష్ పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిట్ అయి ఉండడం వల్ల తనతో సినిమా చేసే అవకాశం కృష్ణవంశీకి రాలేదు. ఇక దాంతో ఆయన వెంకటేష్ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా వరుసగా సింధూరం, అంతఃపురం, మురారి లాంటి సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత అయినా వీళ్ళు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందేమో అని అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూశారు.

    అయినప్పటికీ వాళ్ళ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి కృష్ణవంశీ అప్పట్లో టాప్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు వెలుగొందాడు. అయినప్పటికీ తను బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

    ఆయనకు అందరితో మంచి సన్నిహిత్యం ఉంది అందరితో సినిమాలు చేయాల్సింది కానీ, అనుకోని కారణాలవల్ల తను సినిమాలు చేయలేకపోయాడు…ఇక తను ఇప్పుడు.కూడా సినిమాలు చేస్తున్నాడు మరీ ఇప్పటికైన వెంకటేష్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లను పెట్టీ ‘రంగా మార్తాండ’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది…