Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి… పుష్ప 2 సినిమాతో దాదాపు 1500 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటనలో భాగంగా ఆయన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి ఈ సంఘటనలో ఆయన తప్పు ఏంటి అంటే సంఘటన జరిగిన నెక్స్ట్ డే నే మృతి పట్ల తను సంతాపం తెలిపి ఆ కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసాను ఇస్తే బాగుండేది. అలాగే హాస్పటల్లో ఉన్న శ్రీ తేజ్ ను వెళ్లి చూసి అతని మెడికల్ కండిషన్ ని ఎలా ఉందో కనుక్కొని తనకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తే అతని మీద ఎలాంటి నెగిటివిటీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మీద చాలావరకు నెగిటివిటి స్ప్రెడ్ అవుతుందనే చెప్పాలి. ఇక దానికి కారణం ఏంటి అంటే ఆయన ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా సక్సెస్ మీట్లు అంటూ తిరగడం వల్ల అతని మీద చాలావరకు నెగిటివిటి స్ప్రెడ్ అయింది.
ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు పుష్ప 2 లోగో ఉన్న షర్ట్ వేసుకొని వచ్చి ఆమె మృతి పట్ల నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పాడు…ఇక అతన్ని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అతను ఈ సంఘటన మీద పెద్దగా రెస్పాండ్ అవ్వడం అనేది చాలామందిని బాధ పెట్టిందనే చెప్పాలి. ఇక తను జైలు కి వెళ్లి వచ్చిన తర్వాత మిగతా నటి నటులు, డైరెక్టర్లు వచ్చి అతన్ని పరామర్శించడం కూడా ఆయనకు చాలా వరకు మైనస్ అయింది…
ఇక దానికి తోడుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పిన వాటికి సమాధానాలు ఇస్తున్నట్టుగా మాట్లాడాడు… కానీ అందులో చాలా వరకు అబద్ధాలు ఉన్నాయంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మీద ఈ నెగెటివిటీ పోయి మళ్ళీ ఎప్పట్లాగే తన గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుకుంటూ తన సినిమా కోసం ఎదురుచూసే సమయం రావాలని ప్రతి ఒక్క అభిమానితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…