Bachchala Malli : ఒకప్పుడు కామెడీ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా, తనని తాను అప్డేట్ చేసుకొని, సరికొత్త కథలతో మన ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రయత్నాలకు ప్రశంసలు అయితే అందుతున్నాయి కానీ, సక్సెస్ లు మాత్రం రావడం లేదు. ‘నాంది’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’, ‘ఉగ్రం’ వంటి సినిమాలు చేసాడు. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన ‘నా సామి రంగ’ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసాడు. ఈ చిత్రం హిట్ అయ్యింది కానీ, అది నాగార్జున ఖాతాలో చేరింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన కామెడీ రూట్ లోకి వెళ్లి ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే చిత్రం చేసాడు. ఇది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.
ఇలా హీరోగా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉన్నాయి. ఈసారైనా ఆడియన్స్ కొత్తగా చేస్తే ఆదరిస్తారేమో అనే ఆశతో ఆయన ‘బచ్చల మల్లి’ అనే చిత్రం చేసాడు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటనకి మంచి మార్కులే పడ్డాయి కానీ, సినిమా కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని ప్రేక్షకుల నుండి రివ్యూస్ రావడం తో , వసూళ్ల పై భారీగా ప్రభావం పడింది. మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు తో పోలిస్తే పది లక్షల రూపాయిల గ్రాస్ తేడా ఉంది. ఇది కచ్చితంగా సరైన ట్రెండ్ కాదు.
మూడవ రోజు ఆదివారం కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని అనుకుంటే, మూడవ రోజు కూడా ఈ చిత్రం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు కేవలం 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి కోటి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఇక షేర్ పరంగా చూస్తే కేవలం 70 లక్షలు మాత్రమే వచ్చాయట. ఈ సినిమా కి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 5 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది. బ్రేక్ ఈవెన్ పొంది, క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది ఇక దాదాపుగా అసాధ్యమే అని తెలుస్తుంది. క్రిస్మస్ సెలవుల్లో కాస్త అయినా ఈ చిత్రం ఉనికిని కాపాడుకుంటుందో లేదో చూడాలి.