Krishnam Raju
Krishnam Raju: కృష్ణ-కృష్ణంరాజు సమకాలీన నటులు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత స్టార్డం అనుభవించిన హీరోలు. అప్పట్లో స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయడం పరిపాటిగా ఉండేది. కృష్ణంరాజు పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కృష్ణతో కృష్ణంరాజు చాలా చిత్రాలు చేశారు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా వీరి మధ్య మంచి అనుబంధం ఉండేదట. కృష్ణ, కృష్ణంరాజు ఒకరినొకరు కొనియాడుతూ మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక కృష్ణంరాజు తన నటవారసుడిగా ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. మరోవైపు కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరూ టాలీవుడ్ టాప్ స్టార్స్. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు. అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్న హీరోలుగా మహేష్, ప్రభాస్ లను చెప్పుకోవచ్చు. మహేష్-ప్రభాస్ కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
కాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు మహేష్ నటించిన ఒక చిత్రం అంటే చాలా ఇష్టం అట. ఆ చిత్రం ఏమిటంటే.. బిజినెస్ మేన్. ఈ సినిమా చూసిన కృష్ణంరాజు ఫిదా అయ్యారట. ముఖ్యంగా మహేష్ నటన ఆ చిత్రంలో చాలా సహజంగా ఉంటుందట. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని, సమాజం గురించి తన ఆలోచనను ఖచ్చితంగా, సూటిగా చెప్పాడని.. కృష్ణంరాజు బిజినెస్ మేన్ చిత్రాన్ని ఉద్దేశించి అన్నారు.
పోకిరి తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి జగన్నాధ్.. రెండో చిత్రంగా మహేష్ బాబుతో బిజినెస్ మేన్ చేశాడు. పోకిరి స్థాయిలో బిజినెస్ మేన్ ఆడలేదు. కానీ మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ప్రేక్షకులు చెప్పుకుంటారు. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా రాశాడు పూరి జగన్నాధ్. 2012లో బిజినెస్ మెన్ విడుదలైంది. మరలా పూరి జగన్నాధ్ తో మహేష్ బాబు మూవీ చేయలేదు.