Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని పూర్తి స్థాయి ఎనర్జిటిక్ క్యారక్టర్ లో చూసి చాలా కాలమే అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు కూడా సీరియస్ సబ్జెక్టు సినిమాలే.
పవన్ కళ్యాణ్ కి ఎంతో స్ట్రాంగ్ జోన్ గా పిలబడే ఎంటర్టైన్మెంట్ జానర్ లో మాత్రం సినిమాలు చేసి దశాబ్దం పైనే దాటుతుంది. అభిమానులు పవన్ కళ్యాణ్ నుండి అవుట్ & అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ లో చూడాలని అనుకుంటూ ఉన్నారు. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమానే రీసెంట్ గా ఆయన నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం.
తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే సినిమా స్టోరీ లైన్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ సముద్ర ఖని. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. అయితే ఇది మొదటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్, కానీ అసలు విషయం ఏమిటంటే ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం 45 నిముషాలు మాత్రమే కనిపిస్తాడట.
గోపాల గోపాల చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంత సేపు అయితే వెండితెర మీద కనిపిస్తాడో, ఈ సినిమాలో కూడా అంతసేపే కనిపిస్తాడట. అందులోనూ దేవుడే, ఇందులోనూ దేవుడే. అయితే ‘బ్రో ది అవతార్’ చిత్రం మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త.ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పొచ్చు.