Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన దాదాపు ఐదు దశాబ్దాలు తన నటన ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా తనదైన శైలిలో రాణించి తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టారు. రాజకీయ నేతగా మారి కేంద్ర సహాయ మంత్రి పదవి చేపట్టి ప్రజాసేవలో కూడా తరించారు. అలాంటి ఆజాతశత్రువు మనల్ని వీడి పోవడం బాధాకరమే. కృష్ణంరాజు మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. ఆయన మనల్ని వీడి పోవడంపై అందరు శోకతప్త హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికారు.

ఆయన మధుమేహం, మూత్ర పిండాల వ్యాధితో బాధపడున్నారు. కరోనా సమయంలో ఎక్కువగా ఇంట్లోనే గడపడంతో చాలా బాధలకు గురయ్యారు. ఇంట్లో ఉంటే ఏం తోచకుండా ఉండటంతో ఆయన బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ నేపథ్యంలో ఆయన రిలీఫ్ కోసం రాడిషన్ హోటల్ కు వెళ్లారు. అక్కడ స్లైడింగ్ డోర్స్ ఉండటంతో వాటిని పట్టుకోవడంతో కింద పడిపోయారు. దీంతో కాళ్లకు దెబ్బ తగిలింది. అపోలోలో సర్జరీ చేశారు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది.
ఆయనకు ఉన్న రోగాలకు కొత్తవి చేరడంతో క్రమంగా ఆయన ఆరోగ్యం మందగించింది. ఆరోగ్యం సహకరించలేదు. మెల్లగా వ్యాధులు చుట్టుముట్టాయి. క్రమంగా దేహం సహకరించకుండా పోవడంతో ఆస్పత్రిలోనే చేరి చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించలేదు. ఆరోగ్య సమస్యలు విషమించడంతో ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొవిడ్ కంటే ముందే ఆయనకు ఆరోగ్య సమస్యలున్నా తరువాత కాలంలో వచ్చిన సమస్యలతోనే ఆయన కోలుకోలేకపోయారు.

తెలుగు తెర దిగ్గజం కోల్పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. గోపికృష్ణ మూవీస్ ద్వారా తన అభిరుచులకు అనుగుణంగా చిత్రాలు తీసి తనలో ఉన్న గొప్ప ఆలోచనలకు కార్యరూపం కల్పించారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. రెబల్ స్టార్ గా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన నటించిన చిత్రాల ద్వారా చిరకాలం తెలుగువారికి గుర్తుండే ఉంటారని చెబుతున్నారు.