https://oktelugu.com/

Animal: బ్లాక్ బస్టర్ యానిమల్ ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? అంతా సందీప్ రెడ్డి వలనే!

డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ బాక్సాఫీజ్ షేక్ చేస్తుంది. మూవీ ఎక్కడా నెమ్మదించే దాఖలాలు కనిపించడం లేదు. ఐదు రోజుల్లో ఐదు వందల కోట్ల మార్క్ దాటేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2023 / 10:14 AM IST

    Animal

    Follow us on

    Animal: సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. టైం అంతా మార్చేస్తుంది. మన నిర్ణయాలతో పాటు ఎదుటి వారి నిర్ణయాలు కూడా ఒకరి కెరీర్ డిసైడ్ చేస్తాయి. బ్లాక్ బస్టర్ ఛాన్స్ మిస్ చేసుకొని ఒక్కోసారి ప్లాప్ మూవీ చేయాల్సి వస్తుంది. మరోసారి ప్లాప్ మూవీ వదులుకుని బ్లాక్ బస్టర్ చేయవచ్చు. ఇక దర్శకుల నిర్ణయాలు నటుల భవిష్యత్ పై చూపుతాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… బ్లాక్ బస్టర్ యానిమల్ చిత్రాన్ని తృటిలో చేజార్చుకుంది ఓ హీరోయిన్. ఆ ఛాన్స్ రష్మిక మందాన ఖాతాలో పడింది.

    డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ బాక్సాఫీజ్ షేక్ చేస్తుంది. మూవీ ఎక్కడా నెమ్మదించే దాఖలాలు కనిపించడం లేదు. ఐదు రోజుల్లో ఐదు వందల కోట్ల మార్క్ దాటేసింది. ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. ఇండియాతో పాటు ఓవర్సెస్ లో యానిమల్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. యానిమల్ మూవీపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా… ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంతో రన్బీర్ కపూర్, బాబీ డియోల్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక మందాన పేర్లు మారుమ్రోగుతున్నాయి.

    పుష్ప అనంతరం రష్మికకు సరైన హిట్ లేదు. యానిమల్ తో ఆ దాహం తీరింది. అదే సమయంలో బాలీవుడ్ లో రాణించాలన్న ఆమె కలకు పునాది వేసింది. అయితే యానిమల్ కోసం సందీప్ రెడ్డి మొదటగా అనుకున్న హీరోయిన్ రష్మిక మందాన కాదట. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణితీ చోప్రాను ఎంచుకున్నారట. సందీప్ రెడ్డి వంగ గీతాంజలి పాత్ర కోసం ఆమెనే ఎంపిక చేశాడట.

    యానిమల్ కి సైన్ చేసిన పరిణితీ చోప్రా ఏడాదికి పైగా ఎదురు చూశారట. మరికొన్ని రోజుల్లో షూటింగ్ మొదలు కానుండగా సందీప్ రెడ్డి వంగ మనసు మారిందట. పరిణితీ చోప్రా ఆ పాత్రకు సరికాదని అనుకున్నారట. ఇదే విషయం ఆమెకు చెప్పి ప్రాజెక్ట్ నుండి తప్పించారట. అంత కాలం తనను వెయిట్ చేయించినందుకు పరిణితీ చోప్రాకు సందీప్ రెడ్డి వంగ క్షమాపణ కూడా చెప్పారట. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ స్వయంగా తెలియజేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.