Venkatesh:సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కొన్ని జానర్లలో మాత్రమే సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటారు. వాళ్ల సినిమాలను చూడడానికి అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఎక్కువగా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ని చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ లో విపరీతమైన ఆదరణని సంపాదించారు. అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకునేది.
ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ అవడం వల్ల వెంకటేష్ కి ఎలాంటి స్టోరీ కావాలంటే అలాంటి కథ ఆయన దగ్గరికి వచ్చేది. అది ఆయనకి చాలా వరకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇక ఇతర భాషల్లో సూపర్ సక్సెస్ అయిన ఫ్యామిలీ సినిమాలని తెలుగు నేటివీటికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి వెంకటేష్ ను హీరోగా పెట్టి తీసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక ఈ క్రమం లోనే ఆయన స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేసిన ‘పవిత్ర బంధం’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా సౌందర్య నటించింది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం వెంకటేష్ ది నెగటివ్ క్యారెక్టర్ గా ఉంటుంది. సినిమా చూసే ఆడియెన్స్ ప్రతి ఒక్కరు వెంకటేష్ ని తిట్టుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ గా క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సౌందర్య కొన్ని సీన్లలో వెంకటేష్ ను డామినేట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో 100% సక్సెస్ అయింది.
ఇక ఈ విషయాన్ని వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ తనని డామినేట్ చేసిన హీరోయిన్లలో సౌందర్య మొదటి స్థానంలో ఉంటుందని, ఇక నటనపరంగా పవిత్ర బంధం సినిమాలో ఆమె చేసిన నటన సూపర్ అని వెంకటేష్ చెప్పడం విశేషం. ఇక అప్పట్లో వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ కి మంచి గుర్తింపు అయితే ఉండేది. ఇద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి…