https://oktelugu.com/

Tollywood Celebrities Favorite Foods: మన పాపులర్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అమితంగా ఇష్టపడే ఫుడ్ మీకు తెలుసా

పవన్ కళ్యాణ్ కి కూడా చిరంజీవి లాగా చేపల పులుసు చాలా ఇష్టం. అంతేకాదు నాటుకోడి కూర కూడా బాగా తింటారు. అయితే పవన్ కళ్యాణ్ కి నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ అంటే మరింత ఇష్టం. అరటికాయ వేపుడు, పప్పు, లెమన్ రైస్ చాలా ఇష్టంగా తింటాడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 2, 2023 / 03:44 PM IST

    Tollywood Celebrities Favorite Foods

    Follow us on

    Tollywood Celebrities Favorite Foods: “వివాహ భోజనంబు వింతైన వంటకంబు” అంటూ ఎస్.వి.రంగారావు పాడిన పాట మన అందరికీ ఎంతో ఇష్టమైన పాట. దీనికి ముఖ్య కారణం మనకి సినిమా అంటే ఎంత ఇష్టమో, ఫుడ్ అంతే దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. మరి మనకు ఇష్టమైన సినిమా, ఫుడ్ రెండింటిని కలుపుతూ… మనకి ఇష్టమైన నటీ నటులకు ఇష్టమైన ఫుడ్ ఏవో చూద్దాం.

    ప్రభాస్

    ఫుడ్ అమితంగా ఇష్టపడే హీరోల్లో ఒకరు ప్రభాస్. తన తినడమే కాకుండా షూటింగ్ లో తనతో ఉన్న నటీనటుల అందరికీ ఫుడ్ తీసుకొచ్చే పెడతాడు అన్న విషయం మన అందరికీ మన డార్లింగ్ గురించి తెలిసిందే. ప్రభాస్‌కు నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఇష్టం. ముఖ్యంగా సీ ఫుడ్ బాగా తింటాడు.పానీ పూరీ కూడా చాలా ఇష్టం.

    చిరంజీవి

    స్వస్థలం నెల్లూరు అయిన చిరంజీవికి సి ఫుడ్స్ అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా ఆయన చేపల పులుసు, రొయ్యల వేపుడు ఎక్కువగా తింటారు. అంతేకాదు కరోణ టైంలో చిరంజీవి చాపల పులుసు, రొయ్యల వేపుడు లాంటి ఎన్నో సీఫుడ్స్ వంటకాలు చేసి ఆయన యూట్యూబ్ ఛానల్ లో పెట్టారు.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ కి కూడా చిరంజీవి లాగా చేపల పులుసు చాలా ఇష్టం. అంతేకాదు నాటుకోడి కూర కూడా బాగా తింటారు. అయితే పవన్ కళ్యాణ్ కి నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ అంటే మరింత ఇష్టం. అరటికాయ వేపుడు, పప్పు, లెమన్ రైస్ చాలా ఇష్టంగా తింటాడు.

    సమంత

    రోజు రోజుకి మరింత అందంగా కనిపించే సమంతాకు ఇష్టమైన ఫుడ్ స్వీట్ పొంగలి అంట. అంతేకాదు రోజుకి కనీసం ఒక్కసారైనా హాట్ ఫిల్టర్ కాఫీ తాగుతుంది సమంత. అలానే అన్ని కూరగాయల వంటకాలు, సాంబార్ రైస్, పాలకోవా ఇష్టంగా తింటుంది.

    రష్మిక మందాన

    రష్మికా కు దోసలు అంటే చాలా ఇష్టం. తను అన్ని రకాల దోశలు ట్రై చేసాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

    మహేష్ బాబు

    ఎంత వయసు వచ్చినా చెక్కుచెదరని అందాన్ని మైంటైన్ చేయడంలో ప్రిన్స్ మహేష్ బాబుకు మహేష్ బాబే సాటి. అలాంటి మన ప్రిన్స్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇష్టమైన ఫుడ్ చెప్పే దానికన్నా ముందు ఆయన అసలు తినని మూడు పదార్థాలు ఏమిటంటే బ్రెడ్,‌ స్వీట్స్ ఇంకా పెరుగు. ఇక ఆయనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, చేపల పులుసు.