https://oktelugu.com/

Telugu Heroes Business: బిజినెస్ లలో రాణిస్తున్న తెలుగు హీరోలు

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి సినిమాలోని సంపాదనే కాకుండా తన బిజినెస్ లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి.

Written By: , Updated On : August 2, 2023 / 03:50 PM IST
Telugu Heroes Business

Telugu Heroes Business

Follow us on

Telugu Heroes Business: మన టాలీవుడ్ హీరో హీరోయిన్లు సినిమాలలోనే కాకుండా బిజినెస్ రంగంలో కూడా మంచి సంపాదన తెచ్చి పెట్టుకుంటున్నారు. సినిమాలో వచ్చిన డబ్బులను డబుల్ చేసుకోవాలనో లేకపోతే తమకు సినిమాలు లేకుండా పోతే సైడ్ లో ఏదైనా బిజినెస్ ఉండాలన్న ఆలోచనో తెలియదు కానీ మొత్తానికి దాదాపు అందరూ హీరో హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు.
ఇలా సైడ్ వ్యాపారాల్లో అత్యంత పేరు తెచ్చుకున్న హీరో హీరోయిన్ లు వివరాలు మీకోసం.

దగ్గుబాటి రానా

బాహుబలి సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్ తో ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా
సినిమారంగంలోకి రాకముందు నుంచి బిజినెస్ లో ఆరితేరిన వ్యక్తి . రానాకి సొంత విఎఫ్ ఎక్స్ కంపెనీ ఉంది. హీరోగా మారిన తర్వాత కూడా ఓ మేనేజ్ మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు ఈ హీరో. ముంబైలో ఉన్న ఈ కంపెనీ ద్వారా కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తూ ఉంటాడు రానా.

రామ్ చరణ్

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి సినిమాలోని సంపాదనే కాకుండా తన బిజినెస్ లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. హైదరాబాద్ పోల్ అండ్ రైడింగ్ క్లబ్ కి యజమాని రామ్ చరణ్. అంతేకాకుండా ట్రూ జెట్ అనే ఎయిర్ వేస్ లిమిటెడ్ ను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు.

నాగార్జున

బిజినెస్ అనే మాటకి వస్తే టాలీవుడ్ లో మొదటగా మనకు గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున ది. హీరోగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భాగస్వామ్య గా ఉన్న ఈ హీరోకి బయట కూడా ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లను నడిపిస్తూ ఆయన ఎంతగానో సంపాదిస్తున్నారు. ఇక స్టార్ మా లో కూడా నాగార్జున పెట్టుబడులు ఉన్న సంగతి మనకు తెలిసింది. ఇలా అనేక రంగాల్లో రాణిస్తు నాగార్జున దూసుకుపోతున్నారు.

మహేష్ బాబు

తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఎవ్వరూ చేయనన్ని యాడ్స్ చేశాడు. అంతేకాకుండా సొంత నిర్మాణ సంస్థ GMB నిర్మాణ సంస్థను ఏర్పాటై చేశాడు. ముఖ్యంగా దేశంలోనే అతి పెద్దదైన AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌ ను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే తన సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేశారు.సినిమాల్లో మాత్రమే కాకుండా కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో (KBSPL) లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, మరో హీరో అక్కినేని నాగార్జునతో కలిసి ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసారు. మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు.