Balakrishna and Nagarjuna: బాలయ్య.. నాగార్జున ఇద్దరూ సమకాలికులే. ఎవరి శైలిలో వాళ్లు స్టార్లు అనిపించుకున్న వాళ్లే. మాస్ లో బాలయ్య విశ్వరూపం చూపిస్తే.. రొమాన్స్ లో నాగార్జున తన తఢాకా ప్రదర్శించాడు. పైగా ఇద్దరి మధ్య వయసు కూడా ఒక ఏడాదే తేడా. కెరీర్ మొదట్లో ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య స్నేహం కొనసాగిన రోజుల నుంచి నాగ్ – బాలయ్య సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
అయితే, ఆ తర్వాత కాలంలో వీరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. ఐతే, ఈ ఇద్దరు ఈ మధ్య ఓ పార్టీలో కలిశారు. చాలా ఆప్యాయంగా ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు. తమ సినిమాల గురించి ఇద్దరు చర్చించుకున్నారు. నిజానికి ఈ మధ్య బాలయ్య ఇమేజ్, స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ డబుల్ అయ్యింది. కానీ నాగార్జున ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. దర్శకుల ఎంపిక విషయంలో నాగార్జున తప్పులు చేస్తూ వస్తున్నారు.
Also Read: Ravi Teja: ఆ ‘హీరోయిన్లే’ కావాలి.. ఇదెక్కడి పైత్యంరా బాబు
దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో ఎందరో టాలెంట్ ఉన్న దర్శకులను పరిచయం చేసిన నాగ్.. ప్రస్తుతం సరైన దర్శకుడిని పెట్టుకోలేక ప్లాప్ లు అందుకుంటున్నాడు. మరోపక్క యాక్షన్ సినిమాల జోనర్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తున్నాడు బాలయ్య. ప్రతీ సినిమాలోనూ బాలయ్యని అభిమానులకు నచ్చేలా చూపించడంలో బోయపాటి లాంటి దర్శకులు సక్సెస్ అవుతున్నారు.
బాలయ్య తనకు ట్యూన్ అయిన దర్శకులతోనే వరుసగా సినిమాలు చేసి హిట్లు కొడుతూ వస్తున్నాడు. బాలయ్య సినిమాల్లో కొత్త యాంగిల్ ఏమీ లేదు. అవసరం లేదు కూడా. ఇప్పటికే బాలయ్యను 360 డిగ్రీల్లో అన్ని కోణాలూ ఆవిష్కరించేశారు. ఇప్పుడు కొత్తగా చూపించడానికి ఏమి లేదు. అందుకే ఇప్పుడు వస్తున్న దర్శకులంతా.. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటున్నారు.
కానీ, నాగార్జున విషయానికి వస్తే.. పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ వయసులో నాగార్జునను ఇది వరకు ఎలా చూశారో, అలానే చూపిస్తే కిక్ ఉండదు. ఈతరం వాళ్లకు ఆ మ్యాజిక్ అర్థమూ కాదు. కొత్తగా చూపిస్తే.. అది నాగార్జున ఇమేజ్‌కి వర్కవుట్ కాదు. అలా… గత కొన్నేళ్లుగా అక్కినేని నాగార్జున ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు.
ఇటు బాలయ్య లైనప్ చూస్తే… అభిమానులకు ఊపు వచ్చేస్తోంది. పైగా బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్య రేంజ్ ను మార్చింది. నాగార్జున ఇమేజ్ ఈ వయసులో ఆయనకు సెట్ కావడం లేదు. ఇదే ఇద్దరి మధ్య తేడా. అయితే, వయసు పెరిగాక.. దానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పటికైనా నాగ్ తనకు తగిన పాత్రల్ని ఎంచుకోవాలి. అప్పుడే హుందాతనం ఉంటుంది. పైగా అప్పుడే కొత్త కథలు పుడతాయి.
Also Read:2022 Tollywood Report: 2022 టాలీవుడ్ రిపోర్ట్ : 6 నెలల తెలుగు సినిమాల రివ్యూ
Recommended Videos