https://oktelugu.com/

Director Sujeeth- Gopichand: ప్రభాస్ తర్వాత గోపీచంద్ తో చేస్తున్నాడు.. చిరు, బన్నీలతో లేనట్టే

Director Sujeeth- Gopichand: సాహోతో ఏకంగా నేషనల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమా చేసే ల‌క్కీ ఛాన్స్ కొట్టాడు సుజిత్‌. అయితే, ఆ సినిమాతో సుజిత్ టాప్ లీగ్‌లో చేరిపోతాడు అని ప్రచారం జరిగింది, నిజానికి ఆ రేంజ్ అవ‌కాశం కూడా ఉంది. కానీ బ్యాడ్ టైమ్. సాహో త‌ర‌వాత‌.. సుజిత్‌ని ప‌ట్టించుకొనే నాధుడే లేకుండా పోయాడు. కథ చెబుతాను అని ఫోన్ చేస్తే.. ‘మనది నీ రేంజ్ బడ్జెట్ కాదు బాబు’ అని కామేడీ చేస్తున్నారు […]

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2022 / 09:08 AM IST
    Follow us on

    Director Sujeeth- Gopichand: సాహోతో ఏకంగా నేషనల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమా చేసే ల‌క్కీ ఛాన్స్ కొట్టాడు సుజిత్‌. అయితే, ఆ సినిమాతో సుజిత్ టాప్ లీగ్‌లో చేరిపోతాడు అని ప్రచారం జరిగింది, నిజానికి ఆ రేంజ్ అవ‌కాశం కూడా ఉంది. కానీ బ్యాడ్ టైమ్. సాహో త‌ర‌వాత‌.. సుజిత్‌ని ప‌ట్టించుకొనే నాధుడే లేకుండా పోయాడు. కథ చెబుతాను అని ఫోన్ చేస్తే.. ‘మనది నీ రేంజ్ బడ్జెట్ కాదు బాబు’ అని కామేడీ చేస్తున్నారు నిర్మాతలు.

    Director Sujeeth- Gopichand

    అందుకే.. చాలా ప్రాజెక్టుల్లో సుజిత్ పేరు వినిపించి.. మాయం అయ్యింది. ఇప్పట్లో సుజిత్ కి ఇక ఏ భారీ సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదు. అందుకే.. సుజిత్ బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ.. అక్కడ ఏ హీరో సుజిత్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. రణబీర్, సుజిత్ తో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ… దానికి సంబంధించిన ఇత‌ర‌త్రా వివ‌రాలేం బ‌య‌ట‌కు రాలేదు.

    Also Read: Balakrishna and Nagarjuna: ప్చ్.. ‘బాలయ్య – నాగార్జున’ల‌కు ఒకటే తేడా !

    మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ఉంద‌ని వార్తలు వినిపించాయి. అలాగే, అల్లు అర్జున్ తో చేస్తాడ‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే ఆ సినిమాలు ఏవి సెట్స్ పైకి వెళ్ళలేదు. మొత్తానికి ఎట్ట‌కేల‌కు సినిమా ఖాయం చేసుకొన్నాడు సుజిత్‌. అవును.. హీరో గోపీచంద్ – సుజిత్ కాంబో దాదాపు సెట్ట‌య్యింద‌ని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

    Director Sujeeth- Gopichand

    గోపీచంద్ కోసం సుజిత్ ఓ క‌థ రెడీ చేసుకున్నాడ‌ని, అది గోపీచంద్ కి వినిపించాడ‌ని, గోపీచంద్ కి బాగా న‌చ్చింద‌ని, దాంతో ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల నుంచి సమాచారం అందుతుంది. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమాతో గోపీచంద్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. సుజిత్ – గోపీచంద్ సినిమా మొద‌ల‌వుతుంది. అయితే, ఈ సినిమా పూర్తి విష‌యాలు ఇంకా తెలియాల్సివుంది. ప్రముఖ తారాగణం, మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను కోన వెంకట్ అందిస్తున్నాడు.

    Also Read:Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

    Tags