Rajamouli , Mahesh Babu
Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరో గా ఎదగడమే కాకుండా యావత్ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటున్నాడు…
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని చేరుకొని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు బాహుబలి సినిమా తీసి ప్రేక్షకులను అల్లరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… ఇక ఎప్పుడైతే ఆయన స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని పెట్టుకున్నాడో అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనను హాలీవుడ్ దర్శకులు సైతం మెచ్చుకున్నారు అంటే ఆయన ఈ సినిమా కోసం ఆయన ఎంతటి ఎఫర్ట్స్ పెట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబును భారీ రేంజ్ లో చూపించాలి అనే దాని మీద పలు రకాల చర్చలు జరుపుతున్నాడు… అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సింహంతో ఫైట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాజమౌళి ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కి పులితో ఫైట్ అయితే పెట్టించాడు.
మరి ఆ ఫైట్ కి అంత ఆదరణ అయితే దక్కలేదు. కానీ ఈ సినిమాలో చూపించబోయే ఫైట్ తో యావత్ మహేష్ బాబు అభిమానులు సైతం ఆనందపడేలా ఉంటుందని రాజమౌళి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా లో సింహం తో ఫైట్ చేయడానికి మహేష్ బాబు కొన్ని ప్రత్యేకమైన క్లాసులను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి కి ఒక కండిషన్ అయితే పెట్టాడట…
సింహం తో ఫైట్ అయిన పర్లేదు కానీ అతను షర్ట్ మాత్రం విప్పను అని చెప్పినట్టుగా తెలుస్తోంది…దానికి రాజమౌళి కూడా ఓకే చెప్పాడట…ఇక ఈ సినిమా 1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఒక హై మూమెంట్ ఉండే విధంగా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దాలని చూస్తున్నారట.
ఇక ఈ సినిమా బాహుబలిని మించి ఉండేలా చూసుకుంటున్నాడు. అలా అయితేనే ఈ సినిమాకి 3,000 కోట్లకు పైన కలెక్షన్లు వస్తాయని చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…