https://oktelugu.com/

NTR And Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో కొంత మంది ఎవర్ గ్రీన్ నటులుగా కూడా గుర్తింపు పొందుతారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 09:47 AM IST

    NTR And Prashanth Neel

    Follow us on

    NTR And Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ చాలా మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీయార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసే సత్తా ఉన్న నటుడు… అలాగే ఎంత పెద్ద డైగ్స్ అయిన సింగిల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కూడా కావడం విశేషం… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కొరటాల శివ డైర్ టైన్ లో చేసిన ‘దేవర ‘ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే… మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ తనదైన రీతిలో ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అనుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మాస్ సినిమా రాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఆయన భారీ సక్సెస్ ని కనక అందుకున్నట్లైతే తనను మించిన నటుడు మరొకరు ఉండరనేది వాస్తవం… ఇక గత సంవత్సరం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి సలార్ రూపంలో భారీ సక్సెస్ ని అందించాడు.

    ఇక అదే సక్సెస్ ని ఎన్టీఆర్ కి కూడా అందిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసుకునే ప్రతి సీన్ కూడా ఒక ఎలివేషన్ తోనే ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఎమోషన్ చాలా స్పష్టంగా చూపిస్తూ తన డార్క్ మోడ్ లో ఉన్న సినిమాని కూడా ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. అలాంటి ఎమోషన్ సీన్లు రాసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని…

    అయినప్పటికీ తను అలవోకగా ఆ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొంది ఒక సూపర్ సక్సెస్ ని సాధించడంలో ఆయనకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక ఆయన తీసిన కే జి ఎఫ్ సినిమా తరహాలోనే చాలా సినిమాలు వచ్చాయి. కానీ అవేవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ చేసిన డార్క్ మోడ్ సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించాయి. అలాగే ఎన్టీయార్ సినిమా కూడా డార్క్ మోడ్ లోనే తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది…