Venkatesh-Trivikram: సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావాలి అంటే ఇండస్ట్రీలో సర్కిల్ అనేది భారీ రేంజ్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎవరికి ఏ సినిమాలో మన అవసరం ఉన్న కూడా మనకున్న సర్కిల్ ద్వారా ఆ సినిమాలో మనకు అవకాశం అయితే వస్తుంది. దానివల్ల మనం పెద్ద ఛాన్స్ లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ సూపర్ స్టార్లుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి.ఇక ఈ విషయం అన్ని క్రాఫ్ట్ లో ఉన్నవారికి వర్తిస్తుంది.
అందుకే ఇండస్ట్రీలో ఎక్కువమంది పరిచయాలను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన విషయం మనకు తెలిసిందే… అయితే అక్కడ ఉన్నప్పుడే పవిత్ర బంధం సినిమాకి పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తున్నప్పుడే వెంకటేష్ గారితో త్రివిక్రమ్ కి మంచి సన్నిహిత్యం ఏర్పడిందట. అప్పుడే త్రివిక్రమ్ ఇండస్ట్రీలో సర్కిల్ ఉంటేనే మనం ఇక్కడ ఎదగగలుగుతాం అనే విషయాన్ని గ్రహించారట. దానివల్లే వెంకటేష్ గారితో బాగా మాట్లాడి ఆయనతో చనువుగా ఉండేవారట.
ఇక తను రైటర్ అయిన తర్వాత వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథ చెప్పే టైంలో కూడా అంతకుముందు వెంకటేష్ గారితో ఉన్న చనువు ఆ సమయంలో ఉపయోగపడిందట. అందువల్ల ఇండస్ట్రీలో పరిచయాలనేవి చాలా ముఖ్యమని చాలా మంది సినీ పెద్దలు సైతం చెబుతూ ఉంటారు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా వెంకటేష్ కి త్రివిక్రమ్ కి మధ్య మంచి అనుబంధం ఉందని వాళ్ళ సన్నిహిత వర్గాలు వారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందుకే వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి రెండు సినిమాలతో మంచి సక్సెస్ లను అందించాడు. ఇక ఇప్పుడు కూడా వీలైతే వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…