Venkatesh: డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రామానాయుడు గారి ప్రోత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటేష్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా బి.గోపాల్ డైరెక్షన్ లో చేసిన బొబ్బిలి రాజా సినిమాతో ఒక్కసారిగా వెంకటేష్ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఇక అప్పటి నుంచి అన్ని జనర్ల ల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆ తర్వాత ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక మొత్తానికైతే వెంకటేష్ తన ఏజ్ కు తగ్గట్టుగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్ లని పోషిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ స్టార్ హీరో అవ్వడంలో ఆయనకు చాలా వరకు హెల్ప్ చేసిన సినిమా అంటే ‘బొబ్బిలి రాజా ‘అనే చెప్పాలి. ఈ సినిమాతో వెంకటేష్ భారీ కలెక్షన్లను సాధించాడు. అలాగే అప్పటివరకు వెంకటేష్ చేసిన సినిమాల్లో ఇది ఒక కొత్త రకం సినిమాగా ప్రేక్షకుల్ని అలరించింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాడు. సైంధవ్ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వెంకటేష్ టాప్ గేర్ లో దూసుకుపోతాడనే చెప్పాలి.
ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబో లో F2, F3 సినిమాలు వచ్చాయి. అవి రెండూ సినిమాలు కూడా కామెడీ ప్రధానంగా సాగేవే కావడం విశేషం…ఇక ఆ తరహా లోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాదిస్తుందని వెంకటేష్ అభిమానులు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు…