Ram Charan Watch: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల దంపతులకు రీసెంట్ గానే ఒక కూతురు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులు ఈ శుభవార్త కోసం సుమారుగా 11 ఏళ్ళ నుండి ఎదురు చూసారు, వారి ఎదురు చూపులకు మొత్తానికి తెరపడింది. మెగా కుటుంబం లో ఉన్న ప్రతీ ఒక్కరు ఈ బిడ్డ జన్మించినందుకు ఎంతో సంతోషిస్తున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ పాప పుట్టిన రోజు నాడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి , ఈ బిడ్డ మా కోడలి కడుపులో పడినప్పటి నుండి మా కుటుంబం అన్నీ మంచి జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే చిరంజీవి కి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా ఒక రేంజ్ లో ఫేమ్ దక్కింది. మరో పక్క వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది.
గత కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయయాత్ర’ రాజకీయ పర్యటన కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనసేన పార్టీ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. ఇలా ఈ పాప పుట్టడం వల్ల మెగా కుటుంబం లో ఇన్ని శుభాలు జరిగాయి. ఇకపోతే పాప ముఖం ని రామ్ చరణ్ ఇప్పటి వరకు అయితే చూపించలేదు కానీ, పాపని ఎత్తుకొని మాత్రం చాలా ఫొటోలే దిగాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
అయితే ఒక ఫొటోలో రామ్ చరణ్ చేతికి ధరించిన వాచ్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. దాని ధర ఎంత ఉంటుందో, కొనుక్కుందాం అని ఒకసారి చూస్తే, అది అక్షరాలా కోటి 62 లక్షల రూపాయిలు అని తెలిసింది. అంత డబ్బు ఉంటే ‘బలగం’ లాంటి సినిమాలనే తీసేయొచ్చు కదా అని నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.