Legend Jagapathi Babu Role: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మైలు రాయి లాంటి చిత్రం ‘లెజెండ్’. బోయపాటి శ్రీను తో ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య చేసిన రెండవ సినిమా ఇది. సరిగ్గా 2014 ఎన్నికల సమయం లో విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లను రాబట్టి సుమారుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమా బాలయ్య బాబు తో పోటీపడి మరి ఆయనతో సరిసమానంగా విలన్ పాత్ర లో మెరిసిన సీనియర్ హీరో జగపతి బాబు. ఆయనకీ ఉన్న ఫ్యామిలీ ఇమేజీకి విలన్ గా తీసుకోవడమే పెద్ద సాహసం, అలాంటిది ఆయన నుండి నెవెర్ బిఫోర్ రేంజ్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకోవడం అనేది మరో పెద్ద సర్ప్రైజ్.అప్పటికే జగపతి బాబు మార్కెట్ మొత్తం పోయింది, హీరో గా అవకాశాలు తగ్గిపోయి ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులు పడుతున్నాడు, అలాంటి సమయం లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రం జగపతి బాబు జీవితాన్నే మార్చేసింది.
ఈ సినిమా తర్వాత జగపతి బాబు రేంజ్ టాలీవుడ్ ని దాటి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆయన మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టు అనే సంగతి అందరికీ తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే ఈ పాత్ర కోసం ముందుగా జగపతి బాబు కంటే కూడా కొంత మంది బాలీవుడ్ నటుల పేర్లని పరిశీలించాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. కానీ ఎవ్వరూ కూడా తన పాత్ర కి న్యాయం చేసేటట్టు అనిపించలేదు. అప్పుడు ప్రముఖ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి ఉన్న రాజశేఖర్ ని ఈ పాత్ర కోసం సంప్రదించాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను, కానీ రాజశేఖర్ అప్పటికే విలన్ పాత్రలు చెయ్యడానికి సిద్ధం గా లేదు. చాలా సున్నితంగానే ఈ పాత్ర నాకు సరిపోదు అని రిజెక్ట్ చేసాడట.
ఇక ఆ తర్వాత ఎవరిని తీసుకుందాం అని తర్జన భర్జన పడుతున్న సమయం లో జగపతి బాబు ని సంప్రదిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట బోయపాటి శ్రీను కి. ఇదే విషయాన్నీ బాలయ్య తో కూడా చెప్పగా, అద్భుతంగా ఉంటుంది వెంటనే కాంటాక్ట్ అవ్వండి అన్నాడట. అలా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరూ చూసారు.