Sudeepa Remuneration: బిగ్ బాస్ తెలుగు 6 నుండి ఆరవ ఎలిమినేషన్ గా సుదీప ఇంటిని వీడిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపే ఎలిమినేషన్ ప్రాసెస్ లో సుదీప ఎలిమినేట్ అయినట్లు బిగ్ నాగార్జున ప్రకటించారు. ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, శ్రీహాన్, సుదీప, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా, కీర్తి ఇలా మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందరూ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. ఫైనల్ గా బాల ఆదిత్య, సుదీప మిగిలారు. వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లు పోలైన సుదీప ఎలిమినేట్ అయ్యారు.

సుదీప ఎలిమినేషన్ బాల ఆదిత్య, మెరీనాలను వేదనకు గురి చేసింది. వారిద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. సుదీప మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపించారు. ఎలిమినేట్ అయ్యానన్న బాధ ఆమె బయటికి చూపించలేదు. నవ్వుతూనే ఇంటి నుండి వేదికపైకి వెళ్ళింది. నేను రెండు వారాలు కూడా ఉండలేనని మా ఆయన రంగనాథ్ అన్నారు. కానీ ఆరు వారాలు ఉన్నాను. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను. హ్యాపీగా షో నుండి వెళ్లిపోతున్నానని నాగార్జునతో చెప్పారు.
ఇక ఆమె ఎలిమినేషన్ కి సేఫ్ గేమ్, సింగర్ రేవంత్ తో గొడవలు కారణమని తెలుస్తుంది. అలాగే గత వారం నామినేషన్స్ లో రేవంత్ కి వ్యతిరేకంగా సుదీప చెప్పిన పాయింట్స్ అంత బలంగా లేవు అన్న వాదన ఉంది. హౌస్లో కొంత వరకు మంచి పేరు తెచ్చుకున్న సుదీప ఆడియన్స్ మనసులో స్థానం సంపాదించుకోలేకపోయింది.

కాగా సుదీప రెమ్యూనరేషన్ ఎంత? ఆరు వారాలు హౌస్లో ఉన్నందుకు ఆమెకు ఎంత దక్కిందన్న సమాచారం బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సుదీప అలియాస్ పింకీ చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఒప్పందంపై షోకి వచ్చారట. వారానికి కేవలం రూ. 25 వేలు ఆమె రెమ్యూనరేషన్ గా తెలుస్తుంది. ఆ లెక్కన ఆరు వారాలకు రూ. 1.50 లక్షలు అందుకున్నారట. పెద్దగా ఆఫర్స్ లేని సుదీప షో వలన పాపులారిటీ వస్తుంది, అది కెరీర్ కి ప్లస్ అవుతుందనే ఆలోచనతో బిగ్ బాస్ షోకి వెళ్లినట్లు సమాచారం.