Balakrishna: బాలకృష్ణ పిచ్చ రొమాంటిక్ అని మరోసారి రుజువైంది. సిక్స్టీ ప్లస్ లో అడుగుపెట్టినా ఆయన ఆలోచనలు ట్వంటీ ఫైవ్ దగ్గరే ఉన్నాయి. కాగా పాతికేళ్ల హీరోయిన్ అంటే క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పేశాడు ఈ నందమూరి హీరో. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2 వేదికగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్లోనే కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసి రికార్డు వ్యూస్ రాబట్టారు. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ లను బాలయ్య అడిగిన డేరింగ్ ప్రశ్నలు లాంచింగ్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచాయి. బాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా ఉన్న 1995 నాటి వెన్నుపోటు అంశాన్ని చర్చకు తెచ్చారు.

అలాగే లోకేష్ ఫారిన్ భామలతో మందు తాగుతూ చిందేస్తున్న ఫోటోలు బయటకు తీసి, వాటి నేపథ్యం ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే అయినప్పటికీ జనాల్లో ఆత్రుత పెంచాయి. వారు కోరుకున్న హైప్ వచ్చి చేరింది. ఇక సెకండ్ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ రావడం జరిగింది. వీరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ జాయిన్ అయ్యారు.
కుర్రాళ్ళతో బాలయ్య సంభాషణ యూత్ ఫుల్ గా సాగింది. వాళ్లలో కలిసిపోయిన బాలయ్య మామూలు అల్లరి చేయలేదు. అమ్మాయిలను లైన్లో పెట్టే విషయాల దగ్గరనుండి రాత్రి వేసే పెగ్ వరకూ స్పైసీ కంటెంట్ చర్చకు వచ్చింది. అమ్మాయిలకు లైన్ ఎలా వేస్తారో చెప్పాలని బాలకృష్ణ విశ్వక్, సిద్దులను అడిగారు. విశ్వక్ సంశయించారు. సిద్దు మొహమాటం లేకుండా చెప్పాడు.

కాగా సిద్ధు కొంచెం ధైర్యం చేసి ప్రజెంట్ హీరోయిన్స్ లో మీ క్రష్ ఎవరని బాలయ్యను అడిగారు. అసలు తడుముకోకుండా వెంటనే రష్మిక మందాన అని చెప్పారు ఆయన. 25 ఏళ్ల రష్మికపై మనసు పారేసుకున్న బాలయ్యను చూసి ఆడియన్స్ షాక్ తిన్నారు. అరవైయేళ్లు దాటిన బాలయ్య ఇరవై ఏళ్లలోనే ఉన్నారని చెవులు కొరుకున్నారు.వాస్తవంగా బాలయ్య అలానే ఆలోచిస్తాడు. నిత్య మన్మధుడిలా ఫీల్ అవుతాడు. ఎవరైనా అంకుల్ అని పిలిస్తే కోపం వచ్చేస్తుంది. మనవళ్లు కూడా బాలా అని పిలవాల్సిందే.