Sherlyn Chopra: బిగ్ బాస్ హిందీ షోలో వివాదాలు ఎదురవుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో సాజిద్ ఖాన్ ను పిలవడం సంచలనంగా మారింది. వివాదాస్పదుడైన సాజిద్ ఖాన్ ను ఎలా ఆహ్వానిస్తారని శృంగార తార షెర్లీన్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2005లో అత్యంత వివాదాస్పదంగా సాజిద్ ఖాన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అతడిపై కేసులు ఉండగా బిగ్ బాస్ షోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించింది. దీంతో సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ షోలోకి పిలవడంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కు బంధువైనందునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

2005లో తన తండ్రి చనిపోయిన సందర్భంలో సాజిద్ ఖాన్ నుంచి పిలుపు రావడంతో తన సినిమాల్లో అవకాశం ఇస్తారేమోనని వెళ్లాను. కానీ నాకు ప్రతికూలతే ఎదురైంది. సాజిద్ ఖాన్ లాంటి వ్యక్తి అలా చేస్తారని అనుకోలేదు. తను నాపై లైంగిక దాడికి యత్నించాడు. తాను గదిలోకి వెళ్లగానే తన పురుషాంగం బయటకు తీయడంతో ఆశ్చర్యపోయాను. నా పురుషాంగానికి ఎంత రేటింగ్ ఇష్తావంటూ వెకిలి నవ్వులు నవ్వడంతో తాను బయటకు వచ్చేశాను. దీంతో అతడిపై కేసు పెట్టినా అది కాస్త వేగవంతంగా పూర్తి కాలేదు.
నా పురుషాంగాన్ని టచ్ చేస్తావా అంటూ దారుణంగా మాట్లాడాడు. తండ్రిని కోల్పోయిన తనపై సానుభూతి చూపకపోవగా ఇలా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు. మహిళలంటే ఎంతో అభిమానం చూపించే షారుఖ్ ఖాన్ కు బంధువైన సాజిద్ ఖాన్ వ్యవహారంపై అసహ్యం వేసింది. అందుకే మీటూ ఉద్యమంలో చేరి సాజిద్ ఖాన్ వ్యవహారాన్ని బయటపెట్టాను. కానీ అతడిపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. చట్టం నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు.

సాజిద్ ఖాన్ కేసు ఇంకా కొనసాగుతున్నా బిగ్ బాస్ లోకి తీసుకోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిర్వాహకులపై కేసు వేస్తానని చెప్పింది. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని బిగ్ బాస్ షోలోకి ఎలా ఆహ్వానిస్తారని అనుమానం వ్యక్తం చేసింది. పెద్ద మనుషులను కదా పిలవాల్సింది నేరస్తులను కూడా పిలుస్తారా? అని అనుమానం వ్యక్తం చేస్తోంది. షెర్లీన్ చోప్రా చేస్తున్న న్యాయపోరాటానికి అందరు మద్దతు ఇవ్వాలని పలువురిని కోరుతోంది.