Homeఎంటర్టైన్మెంట్Sontham Movie Heroine: సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది... అసలు గుర్తు పట్టలేదుగా!

Sontham Movie Heroine: సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది… అసలు గుర్తు పట్టలేదుగా!

Sontham Movie Heroine: 2002లో విడుదలైన సొంతం సూపర్ హిట్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్ల. సొంతం సినిమాలో సునీల్, ఎమ్ ఎస్ నారాయణ కామెడీ హైలెట్ గా ఉంటుంది. ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో నమిత హీరోయిన్. సెకండ్ హీరోయిన్ గా నేహ పెండ్సే నటించింది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈమె సొంతం మూవీ హీరోయినా అని అవాక్కు అవుతున్నారు.

ముంబై కి చెందిన నేహ 1999లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. సంజయ్ దత్ హీరోగా నటించిన దాగ్ మూవీలో చిన్న రోల్ చేసింది. ఇక తెలుగులో నేహ మొదటి చిత్రం సొంతం. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నేహకు అడపాదడపా ఆఫర్స్ వచ్చాయి. గోల్ మాల్, పొదరిల్లు, వీధి రౌడీ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగులో ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు.

దాంతో హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఒక దశలో వరుసగా మరాఠీ చిత్రాలు చేసింది. 2020లో విడుదలైన జూన్ చిత్రం అనంతరం నేహ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. కాగా అదే ఏడాది నేహ తన బాయ్ ఫ్రెండ్ శార్దూల్ సింగ్ బయాస్ ని వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సినిమాలు మానేసిన నేహ బుల్లితెర షోలలో మాత్రం సందడి చేస్తుంది.

అలాగే నేహ సీరియల్ నటిగా కొనసాగుతుంది. మే ఐ కమ్ ఇన్ మేడమ్? సీజన్ 2లో నటిస్తుంది. ఇది కామెడీ సిరీస్ గా తెరకెక్కింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. నేహ లేటెస్ట్ లుక్ చూసిన జనాలు అవాక్కు అవుతున్నారు. ముఖ్యంగా సొంతం మూవీలో లుక్ కి ఇప్పటి లుక్ కి చాలా తేడా వచ్చింది. దాంతో సొంతంలో నటించిన హీరోయినా ఈమె అని అవాక్కు కావడం జనాల వంతు అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

RELATED ARTICLES

Most Popular