https://oktelugu.com/

Innerwear For Women: ఈ థర్మల్ వేర్ క్లాత్స్ ధరిస్తే.. చలి నుంచి ఈజీగా విముక్తి

థర్మల్ వేర్ క్లాత్‌లో లోదుస్తులు ఉంటాయి. వీటిని ధరించడం వల్ల శరీరానికి వేడి తగులుతుంది. మీరు దుస్తులు ధరించే ముందు ఈ థర్మల్ వేర్ లో దుస్తులను ధరించాలి. ఆపై దుస్తులు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. శీతాకాలంలో ఈ థర్మల్ లో దుస్తులు చలి నుంచి బాగా విముక్తిని కలిగిస్తాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2024 / 06:00 AM IST

    Innerwear For Women

    Follow us on

    Innerwear For Women: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. ఈ చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తున్నాయి. అలా అని బయటకు వెళ్లకుండా ఉండలేం. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది. పిల్లలు అయితే స్కూళ్లకు, ఉద్యోగాలు చేసే వారు ఆఫీసులకు ఇలా వెళ్తూనే ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోయిన ఎంత చలి ఉన్నా కూడా వెళ్లడం మానరు. ఈ చలిలో ఎక్కువగా తిరిగితే దగ్గు, జలుబు వంటివి కూడా వస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే ఈ సమస్యలు కూడా వస్తాయి. ఎంత స్వెటర్లు, రగ్గులు కప్పుకున్న కూడా చలి తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టం. అయితే చలి నుంచి విముక్తి చెందాలంటే థర్మల్ వేర్ క్లాత్‌లను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. మరి వీటివల్ల ఎలా చలి నుంచి విముక్తి పొందవచ్చు? ఈ థర్మల్ వేర్ క్లాత్‌ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

    థర్మల్ వేర్ క్లాత్‌లో లోదుస్తులు ఉంటాయి. వీటిని ధరించడం వల్ల శరీరానికి వేడి తగులుతుంది. మీరు దుస్తులు ధరించే ముందు ఈ థర్మల్ వేర్ లో దుస్తులను ధరించాలి. ఆపై దుస్తులు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. శీతాకాలంలో ఈ థర్మల్ లో దుస్తులు చలి నుంచి బాగా విముక్తిని కలిగిస్తాయి. చల్లగా ఉండే వాతావరణంలో వీటిని ధరించడం వల్ల మీ బాడీ ఎంతో వెచ్చగా ఉంటుంది. ఎలాంటి చల్లదనం తగలకుండా జలుబు, దగ్గు వంటివి కూడా రావు. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. వీటిని ధరించడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు కూడా రావు. ఎంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా మీ బాడీ వెచ్చగా ఉంటుంది. ఇవి ధరించడానికి చాలా తేలికగా ఉంటాయి. అలాగే సౌకర్యంగా కూడా ఉంటాయి. అలాగే శ్వాసక్రియ కూడా బాగా జరిగేలా చేస్తుంది. వీటిలో టాప్, ప్యాంట్ ఇలా అన్ని ఉంటాయి. వీటిని లోదుస్తులు ధరించిన తర్వాత వేసుకుని, ఆపై దుస్తులు వేసుకుంటే మీ బాడీ వెచ్చగా ఉంటుంది. థర్మల్ క్లాత్‌లు చల్లదనాన్ని తగ్గించి వేడిని ఇస్తాయి.

    చలికాలంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరిగే కొలది సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరానికి వెచ్చగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ కాలంలో చల్లని నీరు కాకుండా కేవలం వేడి నీటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. చలి కాలంలో చల్లని నీరు తాగడం, స్నానం చేయడం వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వేడి నీరు తాగడం, స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు బయట తిరగవద్దు. అలాగే ఉదయం, రాత్రి వేళలో అసలు బయటకు వెళ్లవద్దు. ఉదయం 8 గంటల వరకు బయటకు రాకుండా ఉండండి. వ్యాయామం చేయాలంటే మాత్రం 8 తర్వాతే చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందు వెళ్లే మంచు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.