Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్క్ ను ఏర్పాటు చేసుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తొలి సినిమా జోష్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, నటుడిగా నాగ చైతన్య కి మంచి మార్కులే పడ్డాయి..ఇక ఆ తర్వాత రెండవ సినిమా ‘ఏ మాయ చేసావే’ అటు కమర్షియల్ పరంగాను భారీ సక్సెస్ ని సాధించి..ఇటు కంటెంట్ పరంగా కూడా టాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది..ఈ సినిమాకి ఒక్క ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనడం లో ఏ మాత్రం అతిసయోక్తి లేదు..ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య చేసిన 100 % లవ్,తడాకా, మనం , ఒక్క లైలా కోసం,ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీ మామ , లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో నాగ చైతన్య సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ పొయ్యాడు..అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఇప్పుడు అక్కినేని ఫామిలీ కి ఫేస్ గా మారిపోయాడు నాగ చైతన్య.
Also Read: Pawan Kalyan- Minister Viswarup: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఆ ఏపీ మంత్రి ఎవరో తెలుసా?
ఇక సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య కెరీర్ పై ఏ మాత్రం కూడా ప్రభావం పడలేదు అనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే ఆయన కెరీర్ మరింత ఊపుని అందుకుంది..యూత్ లో తన సినిమా ఒక్క బ్రాండ్ గా మారిపోతున్న ఈ క్రేజ్ ని కరెక్టుగా కాష్ చేసుకుంటున్నాడు నాగ చైతన్య..ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి 10 నుండి 12 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం ని డిమాండ్ చేస్తున్నాడు అట..తనకి ప్రస్తుతం 40 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ ఉండడం తో అంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెయ్యడం లో ఏ మాత్రం తప్పులేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఇక నాగ చైతన్య ప్రస్తుతం మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమా తో పాటు అమెజాన్ ప్రైమ్ లో ‘దూత’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు నాగ చైతన్య..త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది..ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరో గా తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ లో నాగ చైతన్య ఒక్క ముఖ్య పాత్ర పోషించాడు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది..అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
Also Read: Jeelugu Kallu: ఏపీలో స్వల్ప ధరకే ఆర్గానిక్ మద్యం.. తాగేటోళ్లకు తాగినంత.. ఎగబడుతున్న జనాలు