Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిద్యమైతే ఉంటుందనే నమ్మకం ప్రతి ప్రేక్షకుడికి కలిగింది. అందువల్లే అతని సినిమాలను చూడడానికి ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా అతని అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రికార్డులను తిరగరాయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక ఈ మూవీ అనంతరం ఆయన మరొక ప్రయోగం చేయబోతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఒక డిఫరెంట్ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం అదే బ్యాడ్రాప్ లో కొనసాగుతుందట. ఇక ఇందులో హీరోగా సూర్య నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న సూర్య సైతం పాన్ ఇండియాలో మాత్రం స్టార్ హీరోగా అవతరించలేకపోతున్నాడు. ఆయన రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయినప్పటికి ఇప్పటివరకు తనకు అవకాశమైతే రాలేదు.
ఇక ఇప్పుడైనా ఆయనకు ఆ అవకాశం వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి సైతం ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వారణాసి సినిమా కోసం 1300 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ఒక అనుభూతిని కలిగిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేయగలిగే సినిమా చేయడం రాజమౌళి వల్లే అవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మరి తను చేయబోతున్న సినిమాల విషయంలో అది ప్రూవ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…