https://oktelugu.com/

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ని దారుణంగా మోసం చేసిన యంగ్ హీరో

Akkineni Nagarjuna: మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి ఎలాంటి ఇమేజి ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రొమాంటిక్ హీరో గా మన్మదుడిగా నాగార్జున గారు 6 పదుల వయస్సులో కూడా అమ్మాయిల మనసు ని కొల్లగొడుతున్నాడు..కొడుకులు ఇద్దరు హీరోలుగా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా నాగార్జున ఇప్పటికి హీరోగానే చేస్తూ కుర్ర హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాడు..అయితే గత కొంతం కాలం క్రితం నాగార్జున వరుస ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 4, 2022 / 11:13 AM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna: మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి ఎలాంటి ఇమేజి ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రొమాంటిక్ హీరో గా మన్మదుడిగా నాగార్జున గారు 6 పదుల వయస్సులో కూడా అమ్మాయిల మనసు ని కొల్లగొడుతున్నాడు..కొడుకులు ఇద్దరు హీరోలుగా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా నాగార్జున ఇప్పటికి హీరోగానే చేస్తూ కుర్ర హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాడు..అయితే గత కొంతం కాలం క్రితం నాగార్జున వరుస ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసాడు..అలాంటి సమయం లో ఆయన తన కొడుకు తో కలిసి చేసిన బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది..ఎంతోకాలం నాగార్జున నుండి ఒక్క భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల ఆకలిని తీర్చింది ఈ సినిమా..ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు అనే దర్శకుడితో ఘోస్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలు శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఇది కాసేపు పక్కన పెడితే నాగార్జున కి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ప్రతి హీరో తో ఎంతో స్నేహం గా మెలిగే స్వభావం ఉన్న నాగార్జున ఒక్క హీరో ని మాత్రం చాలా కాలం నుండి దూరం పెట్టాడు అట..ఇంతకీ ఎవరు ఆ హీరో..నాగార్జున గారికి అంత కోపం వచ్చే పని ఏమి చేసాడు అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

    Nagarjuna

    Also Read: Pawan Kalyan- Minister Viswarup: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఆ ఏపీ మంత్రి ఎవరో తెలుసా?

    ఇక అసలు విషయానికి వస్తే నాగార్జున హీరో గా కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు కూడా కొంతమంది హీరోలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనే సంగతి మన అందరికి తెలిసిందే..అలా ప్రస్తుతం ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒక్కరిగా మారిన ధనుష్ కూడా అప్పట్లో నాగార్జునని తన సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడు..స్టోరీ బాగా నచ్చడం తో నాగార్జున ఆ పాత్ర చెయ్యడానికి అంగీకరించి డేట్స్ కూడా ఇచ్చేసాడు..షూటింగ్ సగానికి పైగా అయిపోయిన తర్వాత ధనుష్ కి మరియు నిర్మాతకి ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా ఈ సినిమాని ఆపేయాల్సి వచ్చింది..కొన్ని కారణాల వల్ల ఆగిపోయినప్పటికీ కూడా నాగార్జున అర్థం చేసుకోగలదు కానీ..ఆగిపోయిన విషయం కనీసం నాగార్జున కి మూవీ టీం వారు చెప్పలేదు అట..అక్కడ నాగార్జున కి బాగా వచ్చింది..అప్పటి నుండి ధనుష్ తో మాట్లాడడం మానేసాడట నాగార్జున.వాస్తవానికి నాగార్జున చెయ్యాల్సిన రోల్ కోసం తన మామయ్య సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తెగ ట్రై చేసాడట ధనుష్..అయితే అప్పట్లో రజినీకాంత్ వేరే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల డేట్స్ కేటాయించలేకపొయ్యాడు..కానీ నాగార్జునని అడిగిన వెంటనే ధనుష్ మీద గౌరవం తో అప్పటికే ఒక్క సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ కూడా డేట్స్ సర్దుబాటు చేసి ఇస్తే, తనకి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం నాగార్జున కి చాలా బాధ కలిగించింది అట.\

    Also Read: Pawan Kalyan Konaseema: కోనసీమ అల్లర్లపై సంచలన నిజాలు చెప్పిన పవన్ కళ్యాణ్

    Recommended Videos:


    Tags