Akhanda: బాలకృష్ణ అఖండ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Akhanda: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సింహా లెజెండ్ రికార్డులను తిరగరాస్తుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే […]

Written By: Navya, Updated On : December 5, 2021 2:40 pm
Follow us on

Akhanda: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సింహా లెజెండ్ రికార్డులను తిరగరాస్తుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే…

అఖండ సినిమా మూడు రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లకు పైగా షేర్స్ కలెక్షన్ చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే 29.50 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుంది. ఇలా మూడు రోజులలో ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా 3 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే..నైజాం: 9.16 కోట్లు, సీడెడ్: 7.78 కోట్లు,
ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు, ఈస్ట్: 2.04 కోట్లు,వెస్ట్: 1.62 కోట్లు, గుంటూరు: 2.71 కోట్లు, కృష్ణా: 1.66 కోట్లు
నెల్లూరు: 1.41 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.60 కోట్లు ఓవర్సీస్: 3.55 కోట్ల బిజినెస్ చేసే రికార్డులు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 53 కోట్లు చేయగా మూడు రోజుల్లోనే 35 కోట్లకు పైగా షేర్స్ రాబట్టింది. ఇంకో 18 కోట్ల వసూళ్లను రాబడితే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుందని ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబడుతోంది. మొత్తానికి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీసు వద్ద తన నటనా విశ్వరూపం చూపించారు అని చెప్పవచ్చు.