https://oktelugu.com/

Nani Gang Leader : ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని ఈ కళ్లద్దాల పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతన్నప్పుడు తన ఫొటోలను ఒకతను విక్రమ్ కు పంపాడని, ఆ తరువాత తనకు ‘గ్యాంగ్ లీడర్’లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2023 / 04:32 PM IST

    gang leader

    Follow us on

    Nani Gang Leader : సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్లలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుంటారు. ఆ తరువాత నేచురల్ స్టార్ నాని గురించి ప్రస్తావిస్తారు. డైరెక్టర్ అవుదామనుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఆ తరువాత స్టార్ హీరో అయ్యాడు. డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా ఏ వేరియెంట్ లోనైనా నటించి ఆల్ టైం మాస్ హీరో అనిపించుకున్నాడు. ఆయన సినీ కెరీర్లో ఆకట్టుకున్న మూవీ ‘నాని గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. నాని యాక్టింగ్ కు మార్కులు పడ్డాయి. అయితే ఇందులో నానితో పాటు నటించిన ఓ అమ్మాయి గుర్తుందా? ఆమె ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా?

    ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నానితో పాటు లక్ష్మీ,ఇతర నటులు ఆకట్టుకుంటారు. తమకు జరిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకోవడానికి నాని ని సహాయం అడుగుతారు. ఇందులో నాని పెన్సిల్ పార్థసారథిగా కనిపిస్తారు. డిఫరెంట్ గా కనిపించి తన నటనా బీభత్సాన్ని సృష్టించాడు. ఆల్ టైం కామెడీ, సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమాలో లేడీ గ్యాంగ్ లో కళ్లద్దాలు పెట్టుకొని అమ్మాయి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చూస్తే తప్ప ఆమె గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే ఈ సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత మరే సినిమాలో కనిపించలేదు. కానీ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    ఈ గ్యాంగ్ లో కళ్లద్దాలు పెట్టుకున్న ఆమె పేరు శ్రీయారెడ్డి. ఈ సినిమాలో నటించిన తరువాత ఆమె అమెరికాకు వెళ్లి చదువుకుంది. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ తాను 9వ తరగతిలో ఉన్నప్పుడు చదువుల కోసం విదేశాలకు వెళ్లానని తెలిపింది. 6 తరగతి చదువుతున్నప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించానని తెలిపింది. సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతన్నప్పుడు తన ఫొటోలను ఒకతను విక్రమ్ కు పంపాడని, ఆ తరువాత తనకు ‘గ్యాంగ్ లీడర్’లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొంది.

    దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ అమ్మాయి మీడియా ముందుకు రావడంతో అంతా షాక్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో అమాయకంగా కనిపించి శ్రీయారెడ్డి ఇప్పుడు ఎంతో అందంగా మారిపోయారు. అంతేకాకుండా తనకు అవకాశం వస్తే సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నట్లు పేర్కొంది. ఇక శ్రీయారెడ్డికి సంబంధించిన పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.