https://oktelugu.com/

Sampoornesh Babu: రియల్ లైఫ్ లో హీరో సంపూర్ణేష్ బాబును చూస్తే తట్టుకోలేరంతే?

తెలుగు సినిమా పరిశ్రమలో కొబ్బరిమట్ట సినిమా తీసి హిట్ సాధించిన సంపూర్ణేష్ బాబు గురించి అందరికి తెలిసిందే. సిద్ధిపేట వాస్తవ్యుడైన అతడి అసలు పేరు నర్సింహాచారి. తన ఊళ్లో ఎంతో సింపుల్ గా ఉంటాడు. లుంగీ కట్టుకుని సైకిల్ మీద నీళ్లు తెచ్చుకుంటాడు. పాలు తెచ్చుకుంటాడు. లుంగీ బనియన్ మీదే దర్శనమిస్తాడు. ఇంతలా సింపుల్ గా ఉండటం అందరికి సాధ్యం కాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2023 / 05:25 PM IST

    Sampoornesh Babu

    Follow us on

    Sampoornesh Babu: ఈ రోజుల్లో సెలబ్రిటీలంటే బయట కనిపించరు. వారు ఎక్కడో వారి పనులు ఉన్న చోట దర్శనమిస్తుంటారు. కానీ ఎక్కడ పడితే అక్కడ జనం మధ్యలో ఉండరు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే డాబు చూపిస్తున్న రోజులు. కానీ ఆయనో సెలబ్రిటీ. ఎప్పుడు కూడా తానో ప్రత్యేక వ్యక్తిని అనే అభిప్రాయం అతడిలో కనిపించదు. సాధారణ వ్యక్తి లాగే లుంగీ కట్టుకుని సైకిల్ మీద మంచినీళ్లు తెచ్చుకుంటాడంటే ఎంతటి సాధారణ వ్యక్తిలా ఉంటాడో అర్థమై ఉంటుంది.

    తెలుగు సినిమా పరిశ్రమలో కొబ్బరిమట్ట సినిమా తీసి హిట్ సాధించిన సంపూర్ణేష్ బాబు గురించి అందరికి తెలిసిందే. సిద్ధిపేట వాస్తవ్యుడైన అతడి అసలు పేరు నర్సింహాచారి. తన ఊళ్లో ఎంతో సింపుల్ గా ఉంటాడు. లుంగీ కట్టుకుని సైకిల్ మీద నీళ్లు తెచ్చుకుంటాడు. పాలు తెచ్చుకుంటాడు. లుంగీ బనియన్ మీదే దర్శనమిస్తాడు. ఇంతలా సింపుల్ గా ఉండటం అందరికి సాధ్యం కాదు.

    ఆయనను పలకరిస్తే కూడా ఇదే విషయం చెబుతుంటాడు. తానేదో పెద్ద స్టార్ ను కాను. ఇప్పటికి కూడా సొంత ఊళ్లో ఫ్రెండ్స్ తోని సరదాగానే ఉంటా. వారు పలకరిస్తే కబుర్లు చెబుతుంటాను. వారితో కలిసి తిరుగుతుంటాను. కానీ తానేదో ఇండస్ట్రీని శాసించే వాడిగా ఫీల్ కాను. ఎప్పటి మాదిరిగానే ఉంటాను. అందరితో కలివిడిగా తిరుగుతాను.

    ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు సినిమా స్టార్ అయినా తనకు గర్వం ఉండదని సూచిస్తున్నాడు. తన పని తాను చేసుకోవడానికి ఎందుకు సిగ్గుపడటం. సింపుల్ గా ఉండటంలోనే మజా ఉంటుంది. ఒక్క సినిమాతోనే సెలబ్రిటీలుగా ఫీలయ్యే వారు ఉన్న నేటి రోజుల్లో సంపూర్ణేష్ బాబు సింపుల్ సిటీ అందరికి నచ్చుతోంది. ఆయన మార్గంలో అందరు నడిస్తే ఎంత బాగుంటుందో అని అంటున్నారు.