Aadi Movie Heroine: సినీ హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయం ఉండాలి.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు వాటితో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి.. అని అంటున్నారు. కొందరు ఫస్ట్ మూవీకే స్టార్ హీరోయిన్ గా మారి ఆ తరువాత పలు అవకాశాలు తెచ్చుకుంటారు. కానీ కొందరు నటించిన సినిమాలు సక్సెస్ కాలేకపోయినా వారికి చాన్సెస్ వస్తూనే ఉంటాయి. డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన ‘ఆది’లో మొదటిసారిగా నటించి పాపులర్ అయిన కీర్తా చావ్లాను ఎవరూ మరిచిపోరు. ప్రస్తుతం ఈ అమ్మడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఇప్పుడామె ఏంచేస్తుందంటే?
‘ఆది’ సినిమాతో కీర్తిచావ్లాకు విశేష గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత ఈమెకు బోలెడు అవకాశాలు వస్తాయని అనుకున్నారు. అయితే అవకాశాలు కొన్ని సినిమాల్లో వచ్చాయి గానీ.. స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. ఈ సినిమా తరువాత ‘కాశీ’, ‘ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు’ తదితర సినిమాల్లో నటంచింది. కానీ అవేవీ హిట్టు కాలేదు. దీంతో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కరోనా సమయంలో ‘అందమైన ఓ ప్రేమ కథ’ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో మరోసారి ఇండస్ట్రీ వైపు చూడడం లేదు.
కీర్తీ చావ్లా సినిమాల్లో నటిస్తూనే స్నేహితులతో కలిసి పలు వ్యాపారాలు చేసినట్లు సమాచారం. అయితే ఆమె తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ ఇతరులతో షేర్ చేసుకునేవారు కాదు. వ్యాపారాల్లో తీవ్ర నష్టం వచ్చిన ఆమె అప్పుల పాలైనట్లు సమాచారం. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తే నటించడానికి కీర్తీ చావ్లా నటించడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు ఛాన్సెస్ రావడం గగనమే అని అంటున్నారు.
అయితే ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె మార్పును చూసి షాక్ అవుతున్నారు. బొద్దుగా ఉండే కీర్తీ చావ్లా పూర్తిగా మారిపోయారు. ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. అయితే ఆమె ఆప్పుల పాలయ్యారని కొందరు కామెంట్ చేసినా కీర్తి చావ్లా స్పందించడం లేదు. దీంతో ఈ న్యూస్ నిజమేనా? అని చర్చించుకుంటున్నారు.