https://oktelugu.com/

Suvarna Mathew: చంద్రముఖి సినిమాలో తలుక్కున మెరిసిన సువర్ణ ఇప్పుడేలా ఉన్నారో తెలుసా..? ఫోటోలు వైరల్…

రజినీకాంత్ హీరోగా, జ్యోతిక, నయనతార ముఖ్య పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించింది.

Written By:
  • Gopi
  • , Updated On : April 6, 2024 / 12:56 PM IST

    Suvarna Mathew acted in Chandramukhi Movie

    Follow us on

    Suvarna Mathew: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఉంటారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లనే కాకుండా మిగతా ఆర్టిస్టులు కూడా చాలా వరకు ఫేమస్ అవుతారు.

    ఇక సక్సెస్ ఫుల్ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్ విపరీతంగా ఎదురు చూస్తారు. ఒక సక్సెస్ దక్కిందంటే ఇండస్ట్రీలో ఆఫర్లు అనేవి వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒకరి టార్గెట్ సక్సెస్ సాధించడమే…ఇక ఇలాంటి క్రమంలోనే అప్పట్లో రజినీకాంత్ హీరోగా, జ్యోతిక, నయనతార ముఖ్య పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన సువర్ణ మాథ్యు తన నటనతో, తన హావా భావాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో వడివేలు పాత్రను కనక మనం ఒకసారి చూసుకుంటే అందమైన భార్యని పెళ్లి చేసుకున్న ఆయన తన భార్య మీద ఎవరి కన్నైనా పడుతుందేమో అనే ఉద్దేశ్యం తో తనని కాపాడుకుంటూ వచ్చే ఒక భర్త క్యారెక్టర్ లో వడివేలు నటించాడు.

    ఇక ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన రజినీకాంత్ కి సువర్ణ కి మధ్య ఏదో సంబంధం ఉంది అనే ఒక ఉద్దేశ్యంతో ఎప్పుడు వాళ్ళిద్దరిని కాపలాకాసే క్యారెక్టర్ లో వడివేలు పండించిన హాస్యం ఆ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. ఇక చంద్రముఖి లాంటి ఒక భారీ సక్సెస్ తర్వాత సువర్ణ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. చక్కని అంద చందాలతో చూడగానే మెరిసేలా కనిపించే సువర్ణ ఆ తర్వాత ఎందుకు సినిమాలు చేయలేదు అని చాలామంది అభిమానులు ఆందోళన చెందారు.1990 లో తమిళ్, మళయాళం లో ఎక్కువ గా సినిమాలు చేసిన సువర్ణ 1992 లో ‘మిస్ కేరళ ‘ టైటిల్ ను కూడా గెలుచుకుంది. కానీ ఆమె 2003 లో వర్గీస్ జాకబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

    ఇక వీళ్ళకి జాకబ్ అనే కొడుకు, జియా అనే కూతురు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత సువర్ణ తన ఫ్యామిలీతో అమెరికా లో సెటిల్ అయ్యారు…ఇక ఇది ఇలా ఉంటే సువర్ణ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం తన ఫోటోలను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు సువర్ణ చంద్రముఖి సినిమాలో కనిపించినట్టుగానే ఉంది. అప్పటికి ఇప్పటికి ఆమె అందం చెక్కుచెదరలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…