https://oktelugu.com/

Spyder Movie Child Artist: ‘స్పైడర్’ చైల్డ్ ఆర్టిస్టు సంజయ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

‘స్పైడర్’ మూవీలో శ్మశానంలో పుట్టి, అక్కడే పెరిగిన పిల్లాడి పాత్రలో నటించిన అబ్బాయి పేరు సంజయ్. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన సంజయ్ డ్యాన్స్, ఇతర సినీ యాక్టివిటీస్ వీడియోలు చేస్తుండేవాడు. యూట్యూబ్ లో ఓ చానెల్ ను ఓపెన్ చేసి అందులో పలు వీడియోలను అప్లోడ్ చేశాడు. ఇలా ఫేమస్ అయిన తరువాత అతని టాలెంట్ చూసి మురుగుదాస్ ‘స్పైడర్’ మూవీలోకి తీసుకున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 15, 2023 / 09:46 AM IST

    Spyder Movie Child Artist

    Follow us on

    Spyder Movie Child Artist: తమిళ డైరెక్టర్ మురుగుదాస్ సినిమాలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆయన మూవీస్ అన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. డిఫరెంట్ కథతో మాస్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉంటాడు. తమిళంలోనే కాకుండా తెలుగు హీరోలతోనూ అయన పలు సినిమాలు చేశారు. వాటిలో ‘స్పైడర్’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అలాగే హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ ఉంటుంది. విలన్ గా ఎస్ జె సూర్య నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఎస్ జె సూర్య చిన్నప్పటి పాత్రలో ఓ కుర్రాడు నటించిన విషయం తెలిసింది. ఈ కుర్రాడు మాములోడు కాదు. ఇంతకీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం.

    ‘స్పైడర్’ మూవీలో శ్మశానంలో పుట్టి, అక్కడే పెరిగిన పిల్లాడి పాత్రలో నటించిన అబ్బాయి పేరు సంజయ్. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన సంజయ్ డ్యాన్స్, ఇతర సినీ యాక్టివిటీస్ వీడియోలు చేస్తుండేవాడు. యూట్యూబ్ లో ఓ చానెల్ ను ఓపెన్ చేసి అందులో పలు వీడియోలను అప్లోడ్ చేశాడు. ఇలా ఫేమస్ అయిన తరువాత అతని టాలెంట్ చూసి మురుగుదాస్ ‘స్పైడర్’ మూవీలోకి తీసుకున్నారు. ఈ సినిమాలో చిన్న విలన్ పాత్రలో సంజయ్ అద్భుతంగా నటించారు. ఈ మూవీ తరువాత అతనిని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు.

    ‘స్పైడర్’ మూవీ అంతగా రాణించయపోయినా ఈ కుర్రాడికి మాత్రం ప్రశంసలు దక్కాయి. దీంతో అతనిని ఇతర సినిమాల్లోకి తీసుకున్నారు. ‘స్పైడర్’ తరువాత జాక్ పాట్, మూగముని, గజినీ కాంత్, దర్బార్ వంటి సినిమాల్లో నటించారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్న ఈ బాబు రియల్ గా భలే స్మార్ట్ గా ఉన్నాడు. పెద్దయ్యాక కచ్చితంగా హీరో అవుతాడని ఆయనను చూసి అంటున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుగా నటించి హీరోలయిన వారు ఎందరో ఉన్నారు. సంజయ్ కూడా అలాగే హీరో అవుతాడని అంటున్నారు.

    అయితే ప్రస్తుతం చదువు కారణంగా సినిమాలను తగ్గించారు. అయితే తనకు సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులకు సాధారణ పాత్రలు ఇస్తారు. కానీ సంజయ్ కి మొదటి సినిమాలోనే సైకో పాత్రను ఇచ్చారు. ఏమాత్రం బెరుకు లేకుండా సంజయ్ అద్భుతంగా నటించడంతో ఆ పాత్ర సినిమాలో హైలెట్ అయింది. దీంతో సంజయ్ కు ఇండస్ట్రీ వైడ్ గా ప్రశంసలు దక్కుతున్నాయి.