Project K: ప్రాజెక్ట్ కే పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సినిమా క్యాస్ట్, బడ్జెట్, సబ్జెక్టు ప్రతి విషయం మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇక విడుదలకు ముందే ప్రాజెక్ట్ కే అరుదైన మైలురాళ్ళు చేరుకుంటుంది. అంతర్జాతీయ గౌరవాలు దక్కించుకుంటుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023కి ప్రాజెక్ట్ కే కి ఆహ్వానం లభించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే నిలిచింది. ఈ వరల్డ్ సినిమా వేదిక సాక్షిగా ప్రాజెక్ట్ కే టీమ్ ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు.
ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్ట్ కే టైటిల్ పై ఆడియన్స్ లో సస్పెన్సు నెలకొంది. అసలు కే అంటే ఏమిటీ? అనే సందేహాలు కలిగాయి. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ యూనిట్ తెరదింపనున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ టీజర్ విడుదల తేదీ ఫిక్స్ చేశారు.
శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ జులై 20 నుండి 23 వరకు జరగనుంది. మొదటి రోజే అనగా జులై 20న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. అయితే భారత కాలమానం ప్రకారం జులై 21న ఇండియాలో ఈ అప్డేట్స్ అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి ఇండియాస్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ చూసేందుకే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ ప్రోమోలో ప్రభాస్, అమితాబ్ కనిపిస్తారని సమాచారం.
శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చించి. కాగా ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే బడ్జెట్ రూ. 500 కోట్లకు పైమాటే. సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
The world awaits the ultimate showdown.
Brace yourselves for a glimpse into the world of #ProjectK on July 20 (USA) & July 21 (INDIA).Stay tuned and Subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms… pic.twitter.com/MMc60mrHxH
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2023