Hero Vineeth: హీరో వినీత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అన్నిటికంటే ముందు ప్రేమదేశం సినిమాతో వినీత్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. 1996లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికి కూడా ఈ సినిమా సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు.
జెంటిల్ మెన్, సరిగమలు, ప్రేమదేశం, వైఫ్ ఆఫ్ వి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, చంద్రముఖి, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలు ఈ హీరోకు సూపర్ హిట్ లను సంపాదించి పెట్టాయి. చాలా మందికి ఈయన ఒక నటుడిగా మాత్రమే తెలుసు. కానీ అతను మంచి డాన్సర్ కూడా. ఈయన భరతనాట్య కచేరీలలో తన ప్రతిభను ప్రదర్శించిన భరతనాట్య కళాకారుడు. విదేశాల్లో పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమా అవకాశాలను వదులుకున్నాడు. ఈయన మల్టీ టాలెంటెడ్ అని చెప్పడంలో సందేహం లేదు.
నటుడు, భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ కూడా. ఎన్నో సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా కూడా చంద్రముఖి, నితిన్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు. నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కనిపించి ఆయన ఫ్యాన్స్ ను సంతోషపెట్టాడు. ఇదిలా ఉంటే ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. 2004లో ప్రిసిల్లా మీనన్ ను వివాహం చేసుకున్నారు వినీత్. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. వీరి ఫ్యామిలీ ఫోటోను వినీత్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది వైరల్ గా మారింది.
వినీత్ కు అంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ట్రావెంకోర్ సిస్టర్స్ గా పేరు సంపాదించిన రాగిణి, పద్మినిలలో పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ మేనల్లుడట. అంతేకాదు సీనియర్ శోభనతో కలిసి భరతనాట్య కచేరీలలో పాల్గొంటాడు కూడా వినీత్.