https://oktelugu.com/

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం.. ఆ స్టార్ డైరెక్టర్, హీరో కేసు ఏమైందంటే?

2018లో పలువురు తారలపై నమోదు చేసిన ఆరు కేసులను రీసెంట్ గా నాంపల్లి కోర్టు కొట్టిపారేసింది. ఈ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేసింది కోర్టు. ఇక 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రెటీలే టార్గెట్ గా ఎక్సైజ్ శాఖ తన దూకుడును పెంచుతూ ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి అనుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 2, 2024 / 02:09 PM IST

    Tollywood Drug Case

    Follow us on

    Tollywood Drug Case: డ్రగ్స్.. ఈ మహమ్మారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తూ సిటీ అంత రాజ్యమేలుతోంది. ఇక ఈ మహమ్మారి చిత్ర పరిశ్రమలో కూడా తన రాజ్యాన్ని విస్తరించింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వల్ల ఎంతో మంది సెలబ్రెటీల మీద కేసులు నమోదయ్యాయి. రీసెంట్ గా ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఇంతకీ ఈ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది? ఈ కేసులో ఇరుక్కున్న వారు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఆరోపణలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    2018లో పలువురు తారలపై నమోదు చేసిన ఆరు కేసులను రీసెంట్ గా నాంపల్లి కోర్టు కొట్టిపారేసింది. ఈ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేసింది కోర్టు. ఇక 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రెటీలే టార్గెట్ గా ఎక్సైజ్ శాఖ తన దూకుడును పెంచుతూ ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి అనుకుంది. కానీ ప్రస్తుతం ఈ కేసుకు పులిస్టాప్ పడ్డట్టు అయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్ తో పాటు పలువురుపై డ్రగ్స్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి.. నెలలు తరబడి విచారించినా ఫలితం శూన్యం.

    ఈ క్రమంలోనే అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు. కేవలం పూరీ, తరుణ్ ల శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా ఇద్దరి శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తేల్చింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం ఆరు కేసుల్లో సరైన సాక్షాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. శాంపిల్స్ పంపిన పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించి ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.

    ఇక డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో కాలేదని కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో జాంబియా యువతికి ఎల్బీనగర్ కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.