Honda Amaze Vs Brezza: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అవసరాలు, అలవాట్లు మారుతున్నాయి. సుదూరం ప్రయాణించేవారు ఇప్పుడంతా సొంత వెహికల్ లో వెళ్లాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కార్ల కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం వినియోగదారుల అవసరాల దృష్ట్యా రకరకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. లో రేంజ్ నుంచి హై రేంజ్ కార్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. తాజాగా హోండా అమేజ్, మారుతి బ్రెజ్జా కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఎస్ యూవీలో రెండు కార్లు అద్భుతమైన ఫీచర్స్ తో పాటు భద్రతను కలిగి ఉండడంతో వీటిపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అంతేకాకుండా ధరల విషయంలోనూ ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ రెండు మోడళ్ల మధ్య కొన్ని తేడాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
హోండా కంపెనీకి చెందిన అమేజ్ 1199 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. 88.5 బీహెచ్ పీ వపర్ తో కూడుకొని ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మరియు మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. పెట్రోల్ ఫ్యూయెల్ కలిగిన ఈ కారు లీటర్ కు 18.3 నుంచి 18.6 వరకు మైలేజ్ ఇస్తుంది. 5 విభిన్న వేరియంట్లలో 2 రకాల రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్ష్ షో రూం వద్ద రూ.7.13 లక్షల నుంచి రూ.9.74 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా 1462 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. 103.26 బి హెచ్ పీ పవర్ తో కూడుకొని ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదా మాన్యువల్ గేర్ బాక్స్ కు అవకాశం ఉంది. ఈ కారు కూడా పెట్రోల్ ఫ్యూయెల్ ను కలిగి లీటర్ కు 17.03 నుంచి 18.76 వరకు మైలేజ్ ఇస్తుంది. రెడ్, బ్లూ, డార్క్ ఎల్లో కలర్ లో అందుబాటులో ఉన్న ఈ కారును రూ.7.84 నుంచి 11. 49 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ఈ రెండు కార్లు ఒకే విధమైన ఇంపాక్ట్ ను కలిగి ఉన్నాయి. అలాగే ధరల్లో కాస్త వ్యత్యాసం మాత్రమే ఉంది. కానీ దేశంలో అత్యధికంగా హోండా అమేజ్ అత్యధికంగా విక్రయమవుతోంది. ఈ కారు రోడ్డు ఎలా ఉన్న స్మూత్ నెస్ ను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉండడంతో కారులో ఉన్న వారికి ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు. అయితే బ్రెజ్జా విషయానికొస్తే 1.5 లీటర్ తో 1462 ఇంజన్ ను కలిగిి ఉంది. అంటే అమేజా కంటే ఇది పెద్ద ఇంజన్ గా భావించవచ్చు. అమేజాలో ఇంటిరియర్ కాస్త నార్మల్ గా ఉంటే.. బ్రెజ్జాలో మాత్రం నాణ్యమైన మెటిరీయల్ ను అమర్చినట్లు తెలుస్తోంది.