https://oktelugu.com/

Allu Arjun Arrested: జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయాన్, స్నేహ.. ఎమోషనల్ వీడియో

అల్లు అర్జున్ నేడు ఉదయం జైలు నుండి విడుదల అయ్యారు. అరెస్ట్ అనంతరం ఆయన ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడారు. కాగా అల్లు అర్జున్ కోసం ఆయన పిల్లలు పరుగున వచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 14, 2024 / 09:31 AM IST

    Allu Arjun Arrested(25)

    Follow us on

    Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకవైపు పుష్ప 2 థియేటర్స్ లో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ కేసులో ఏ 11గా అల్లు అర్జున్ పేరు పొందుపరిచారు. డిసెంబర్ 12న అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని ప్రవేశ పెట్టారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

    అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో అల్లు అర్జున్ కి ఊరట లభించింది. నిన్నే అల్లు అర్జున్ విడుదల కావాల్సి ఉంది. ఆర్డర్ కాపీ అందలేదని జైలు అధికారులు రాత్రి అక్కడే ఉంచారు. నేను ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మొదట సమీపంలోని మామగారు ఇంటికి అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ కొందరు ప్రముఖులను ఆయన కలిశారు.తర్వాత నేరుగా ఇంటికి వెళ్లారు.

    అల్లు అర్జున్ రాకను చూసిన పిల్లలు అయాన్, అర్హ పరుగున వచ్చారు. తండ్రిని హగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. భార్య స్నేహ సైతం ఆతృతగా ఎదురు చూశారు. ఈ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. కాగా అరెస్ట్ తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. మహిళ మృతి దురదృష్టకరం. అలాగే ఈ కేసు కోర్టులో ఉంది నేనేమీ మాట్లాడలేను. నిజంగా ఇది కఠిన పరిస్థితి. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు అని, అల్లు అర్జున్ అన్నారు.