https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోలుగా ఎదుగుతున్న మరికొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళ సత్తా చాటుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : December 22, 2024 / 02:23 PM IST

    Allu Arjun(8)

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా వెలుగుందడమే కాకుండా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఆయన ఆ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తొందర్లోనే తెలియజేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని భారీ బడ్జెట్ లో తెరకెక్కించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. మరి మొత్తానికైతే ఈ సినిమాతో తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే పుష్ప సినిమాతో మాస్ సినిమా చేశాడు. మరి త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మాస్ సినిమా కాకుండా డిఫరెంట్ జానర్లో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైన కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కారణమేంటంటే ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి అయితే క్రియేట్ అయింది. మరి అదే సక్సెస్ ఫార్ములా ను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు.

    కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ మార్కెట్ ను భారీ రేంజ్ లో పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమాని చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త సినిమాగా రూపొందించబోతుందనే విధంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ అయితే చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాడు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ 30 కోట్ల వరకే రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ప్రస్తుతం 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తరైతే వస్తున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడనే చెప్పాలి. మరి ఇప్పుడు కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? పాన్ ఇండియా ప్రేక్షకులు త్రివిక్రమ్ సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…