Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని నేడు గ్రాండ్ గా ప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా నార్త్ అమెరికా లోని డల్లాస్ ప్రాంతం లో ప్రత్యేకంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి అక్కడి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్, శంకర్, హీరోయిన్ కైరా అద్వానీ, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అంజలి, ఎస్ జె సూర్య , ఇలా ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ లో పాల్గొని అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు. ఈ ప్రసంగాలు విన్న తర్వాత గేమ్ చేంజర్ చిత్రం పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇది ఇలా ఉండగా ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ఆడిటోరియం కెపాసిటీ కేవలం 9 వేల మంది హాజరు అయ్యే విధంగా ఉంటే, అభిమానులు కెపాసిటీ కి మించి 11 వేల మంది వచ్చారు. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. సాయంత్రం నుండే ఎముకల కొరికే చలిని కూడా లెక్క చేయకుండా అభిమానులు భారీ సంఖ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం కి చేరుకున్నారు. రామ్ చరణ్ వచ్చిన వెంటనే ‘జై చరణ్’ నినాదాలతో హోరెత్తించారు. ఈవెంట్ జరుగుతున్నంతసేపు వైల్డ్ ఫైర్ అనుభూతి కలిగింది. ఈవెంట్ పూర్తి అయ్యినప్పటికీ కూడా అభిమానుల్లో జోష్ తగ్గలేదు. అర్థ రాత్రి 12:30 నిమిషాలు దాటినా కూడా అభిమానుల్లో ఎనర్జీ తగ్గలేదు. అయితే ఈ ఈవెంట్ ని లైవ్ టెలికాస్ట్ చేసి ఉండుంటే మన ఇండియన్ ఫ్యాన్స్ మంచిగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. సినిమా మీద ఇంకా హైప్ పెరిగేది అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఇకపోతే ఈ ఈవెంట్ కి పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఒక అతిథిగా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని రీసెంట్ గానే చూశానని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంటుందని, క్లైమాక్స్ రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ని రప్పించే రేంజ్ లో ఎమోషన్ ఉంటుందని, బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించే సినిమా అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజు ప్రసంగం లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ని కనెక్ట్ చేసుకొని మాట్లాడిన కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా మంచి కిక్ ని ఇస్తుంది. వీటితో పాటు నేడు విడుదల చేసిన ‘డోప్’ వీడియో సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్పులకు సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇక ట్రైలర్ కూడా క్లిక్ అయితే సినిమాకి ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి.