Surya Remuneration: కమల్ హాసన్ విక్రమ్ తో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ రెండు రోజుల్లో రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్ లో సైతం విక్రమ్ దుమ్మురేపుతోంది. ఇప్పటికే యూఎస్ లో $1.5 మిలియన్ వసూళ్లను దాటేసిన విక్రమ్, ఫుల్ రన్ లో మూడు మిలియన్స్ దాటేయడం ఖాయం అంటున్నారు. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ కి ఆదరణ దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది.

దర్శకుడు లోకేష్ కనకరాజ్ టేకింగ్, స్క్రీన్ ప్లే గురించి సినీ జనాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ ని ఓ యాక్షన్ హీరోగా ఆయన ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం. ఇక ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి రోల్స్ మైండ్ బ్లాక్ చేశాయి. ముఖ్యంగా అనిరుధ్ బీజీఎమ్ గురించి చుప్పుకోవాలి. ఒకప్రక్క లోకేష్ తన స్క్రీన్ ప్లే తో సినిమాను పరుగులు పెట్టిస్తుంటే, ప్రతి సన్నివేశం ఎలివేట్ అయ్యేలా అనిరుధ్ బీజీఎమ్ కట్టిపడేసింది.
Also Read: JP Nadda Slams YCP Govt: మా పథకాలు.. జగన్ పేర్లు.. పోటు పొడిచిన జేపీ నడ్డా
కాగా క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ సినిమాకు మరో ఎత్తు అన్నట్లుంది. విక్రమ్ కారణంగా కూలిపోయిన తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చిన రోలెక్స్ సర్ గా సూర్య గెస్ట్ రోల్ గూస్ బంప్స్ కలిగించింది. విక్రమ్ 2 ఉంది అన్నట్లు లీడ్ ఇవ్వడం కోసం లోకేష్ కనకరాజ్ ఈ క్యారెక్టర్ ని ప్రవేశ పెట్టాడు. విక్రమ్ మూవీ హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది. మరి ఈ పాత్రకు సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

అయితే సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో సాన్నిహిత్యంతో కలిగిన సూర్య ఫ్రీగా చేయడానికి ఒప్పుకున్నారట. అలాగే విక్రమ్ కమల్ హాసన్ మూవీ కావడం కూడా ఒక కారణమట. కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్ సినిమాలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సూర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విక్రమ్ సినిమాకు సూర్య రెమ్యూనరేషన్ తీసుకోలేదన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read:Hyderabad Ganja Found: ట్రైన్ నుంచి విసిరేసిన బ్యాగ్ విప్పి చూస్తే షాక్ అయిన పోలీసులు
Recommended Videos
[…] Also Read: Surya Remuneration: రెండు నిమిషాల గెస్ట్ రోల్ కి స… […]