https://oktelugu.com/

Ram Charan- Nikhil Siddharth: ‘ఇండియా హౌస్’ లో నటిస్తున్నందుకు రామ్ చరణ్ హీరో నిఖిల్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడా తెలుసా..!

ఒక పక్క ఇంత బిజీ గా ఉంటూనే మరో పక్క నిర్మాతగా కూడా ఆయన బిజీ కాబోతున్నాడు. రీసెంట్ గానే ఆయన యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 29, 2023 3:51 pm
    Ram Charan- Nikhil Siddharth

    Ram Charan- Nikhil Siddharth

    Follow us on

    Ram Charan- Nikhil Siddharth: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎంత బిజీ గా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే.#RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే మూవీ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన సెప్టెంబర్ నెల నుండి ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కించబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

    ఒక పక్క ఇంత బిజీ గా ఉంటూనే మరో పక్క నిర్మాతగా కూడా ఆయన బిజీ కాబోతున్నాడు. రీసెంట్ గానే ఆయన యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించారు. ఈ బ్యానర్ లో మొదటి ప్రాజెక్ట్ గా యంగ్ హీరో నిఖిల్ ని పెట్టి ‘ఇండియా హౌస్’ అనే చిత్రాన్ని తీస్తున్నట్టుగా నిన్న అధికారిక ప్రకటన చేసారు.

    ఫ్రీడమ్ ఫైటర్ సావర్కర్ లైఫ్ స్టోరీ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా నిలిచింది. ఇదంతా పక్కన పెడితే హీరో నిఖిల్ ఈ సినిమా లో నటిస్తున్నందుకు గాను రామ్ చరణ్ ఆయనకీ 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నట్టుగా సమాచారం. ఇది నిఖిల్ కెరీర్ లోనే భారీ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు.

    ‘కార్తికేయ 2 ‘ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపిన నిఖిల్, ఇప్పుడు ఈ ‘ఇండియా హౌస్ ‘ అనే చిత్రం తో మరోసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకి నిఖిల్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ క్రేజ్ కూడా తోడయ్యింది.ఇక అమెరికా నుండి అనకాపల్లి వరకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.