https://oktelugu.com/

Central Vista Project: సెంట్రల్‌ విస్టాతో ప్రజాధనం ఆదా.. అదెలా అంటే..!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి.

Written By: , Updated On : May 29, 2023 / 03:45 PM IST
Central Vista Project

Central Vista Project

Follow us on

Central Vista Project: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుతో ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృథా కాదని, పైగా ఏటా రూ.1,000 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్రం తెలిపింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా నూతన పార్లమెంటు భవన నిర్మాణాన్ని సమర్థించారు. వందేళ్ల క్రితం నాటి ప్రస్తుత పార్లమెంట్‌ భవనం అనేక సమస్యలకు నిలయంగా మారిందని తెలిపారు. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. సభ్యులు, స్పీకర్లు కూడా ఈ విషయాన్ని తెలిపారని వెల్లడించారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ఇదీ..
సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఈ ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలపై కేంద్రం దృష్టి పెట్టనుంది. వాటిలో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌క్లేవ్, కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ బిల్డింగ్స్, డిఫెన్స్‌ ఎన్‌ క్లేవ్, ఎంపీల చాంబర్లు, ప్రధాన మంత్రి కొత్త నివాసం, కార్యాలయం ఉన్నాయి.

తొలి, రెండో నిర్మాణాలు పూర్తి..
ప్రాజెక్టులో తొలి నిర్మాణంగా గతంలో రాజపథ్‌గా వ్యవహరించిన కర్తవ్యపథ్‌ ఆధునికీకరణ పూర్తయింది. రెండోదైన పార్లమెంటు నూతన భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మించింది. పీఎంవోకు సంబంధించిన ఎగ్జి క్యూటివ్‌ ఎన్‌క్లేవ్‌ హౌసింగ్, కేబినెట్‌ సెక్రటేరియట్, ఇండియా హౌస్‌–నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటే రియట్‌ నిర్మాణాలను ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ రూ.1,189 కోట్ల అంచనా వ్యయంతో 2022 నవంబరులో చేపట్టింది. అప్పటి నుంచి 24 నెలల కాలంలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అలాగే రూ. 3,142 కోట్ల అంచనా వ్యయంతో అదే సంస్థ కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియ ట్‌కు చెందిన మూడు భవనాలను నిర్మిస్తోంది. 2024 జూన్‌ నాటికి ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌(ఐజీఎన్సీఏ) కొత్త భవనాన్ని, 2026 డిసెంబరు నాటికి సెంట్రల్‌ కాన్ఫెరెన్స్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

కేసుల సుడి..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. 2019, సెప్టెంబరులో ప్రాజెక్టును ప్రకటించగా 2020, డిసెంబరు 10న పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన కేసులన్నీ సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టుల్లో ఉన్నాయి. తాజాగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పార్లమెంటు కొత్త భవ éన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్సభ సెక్రటేరియేట్‌ను ఆదేశించాలని తమిళనాడుకు చెందిన న్యాయవాది జయసున్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిల్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించేందుకు జస్టిస్‌ జేకే.మహేశ్వరి, జస్టిస్‌ íపీఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

– గతంలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని రాజీవ్‌ సూరి, అంజు శ్రీవాస్తవలతోపాటు మరికొందరు తొలిసారి ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చివరకు సుప్రీం కోర్టుకు చేరిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది.

– 2021లో కొవిడ్‌ మహమ్మారి రెండో దశ విజృంభణ సందర్భంగా ఆరోగ్యం, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులు నిలిపేయాలంటూ అనన్య మల్హోత్రా, సొహైల్‌ హష్మీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారి వాదనను తోసిపుచ్చి నిర్మాణపనులకు పచ్చజెండా ఊపింది.

– జాతీయ చిహ్నలోని నాలుగు సింహాలు ఉగ్రంగా ఉన్నాయంటూ కొందరు పిటిషనర్లు, న్యాయవాది అల్లా నీరెయిన్‌ సుప్రీంను ఆశ్రయించారు.

అద్దె భారం తప్పితుంది..
కేంద్రం వివిధ కేసులకు సబంధించి సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం.. సెట్రల్‌ విస్టాతో ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేసే అద్దె రూ.1000 కోట్లకు పైగా మిగులుతుందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక కార్యాలయాలు వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్నాయని, చాలా వరకు అద్దె భవనాల్లో ఉన్నాయని పేర్కొంది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తయిన తర్వాత, అన్ని కార్యాలయాలు ఒకే చోట వస్తాయని, ఇది అద్దెను ఆదా చేయడమే కాకుండా, మెరుగైన సమన్వయంతో కూడిన కార్యాలయాలను కూడా కలిగి ఉంటుందని వివరించింది.

అధ్యయనం అవసరం లేదు..
ప్రాజెక్ట్‌ను సవాల్‌ చేసేవారు కోరినట్లుగా, కొత్త పార్లమెంటు అవసరమా కాదా అని నిర్ణయించడానికి ప్రత్యేక స్వతంత్ర అధ్యయనం అవసరం లేదని సొలిసిటర్‌ జనరల్‌ మెహతా తెలిపారు. ఈమేరకు జస్టిస్‌ ఏఎం నేతృత్వంలోని ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.

భూ వినియోగంలో అక్రమాలపై స్టేకు నిరాకరణ..
ప్రాజెక్ట్‌ కోసం భూ వినియోగంలో అక్రమ మార్పు జరిగిందన్న ఆరోపణలపై ఖాన్విల్కర్‌ స్పందిస్తూ.. కొత్త పార్లమెంటు భవనం, అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కోసం 10 పరిపాలనా భవనాల నిర్మాణంతో కూడిన పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ప్రస్తుతం ఉన్న నార్త్‌ మరియు సౌత్‌ బ్లాక్‌లను మ్యూజియంలుగా మార్చడం కూడా ఇందులో ఉంది. రాజ్‌పథ్‌ను ఇండియా గేట్‌కు అనుసంధానించే సెంట్రల్‌ విస్టా అభివృద్ధిని కూడా ప్రాజెక్ట్‌ ప్రతిపాదించింది. ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తున్నప్పుడు, అత్యున్నత న్యాయస్థానం ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.