Unstoppable with NBK S2 – Prabhas : ప్రేక్షకులకు కన్నుల పండుగలాగా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో నిలుస్తోంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోస్ లో ఒకటిగా నిలిచింది.. ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన నందమూరి బాలకృష్ణకి యూత్ లో మామూలు క్రేజ్ తెచ్చిపెట్టలేదు.. అఖండ సినిమా ఆయనకీ ఎంత మేలు చేసిందో మనం చెప్పలేము కానీ..ఈ టాక్ షో మాత్రం బాలయ్యబాబు ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి కూర్చోపెట్టింది.

అంతే కాకుండా ఆయన సినీ కెరీర్ కి కూడా ఎంతో బూస్ట్ ని ఇచ్చింది ఈ టాక్ షో..మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. రెండో సీజన్ అంతకు మించి డబుల్ హిట్ అయ్యింది..ఇక ఈ సీజన్ లో తదుపరి ఎపిసోడ్ కి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే..గత వారం రోజుల నుండి ఫ్యాన్స్ ని ప్రోమో కోసం ఊరిస్తూ వచ్చింది ఆహా మీడియా.
అలా ఊరిస్తూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ మొత్తానికి ఈరోజు ప్రోమోని విడుదల చేసారు..మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి అదిరిపొయే రెస్పాన్స్ వచ్చింది..ప్రభాస్ బయట పెద్దగా మాట్లాడడు అనే పేరు ఉండేది..కానీ ఈ షోలో ఆయన తన రియల్ లైఫ్ లో ఎంత జోవియల్ గా ఉంటాడో..అంతే జోవియల్ గా ఈ ఎపిసోడ్ లో ఉన్నాడు.. అంతే కాకుండా ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన ముఖ్యమైన సీక్రెట్ ని కూడా ఈ షో ద్వారా రివీల్ చేసినట్టు తెలుస్తుంది..అయితే ప్రభాస్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొనేందుకు కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్నాడని ఫిలిం సర్కిల్ లో గత కొద్ది రోజుల నుండి జోరుగా ప్రచారం ఉంది.
అయితే మాకు ఆహా మీడియా లో తెలిసిన కొంతమంది సాంకేతిక నిపుణులను ఇదే విషయం పై అడగగా, ప్రభాస్ మాత్రమే కాదు..ఈ షో లో పాల్గొనే ఒక్క సెలబ్రిటీ కూడా ఇప్పటి వరకు రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని.. బాలయ్య బాబు మీద ఉన్న అభిమానంతోనే మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ షో లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు..కాబట్టి ఇకపై ఆ రూమర్స్ కి చెక్ పడినట్టే.