https://oktelugu.com/

Samantha- Akkineni Akhil: అక్కినేని అఖిల్ సరసన సమంత..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్!

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఏజెంట్' చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తో ఆయన మరో లెవెల్ కి వెళ్తాడు అనుకుంటే, ఇంకా క్రిందకి దిగజారిపోయాడు.

Written By:
  • Shiva
  • , Updated On : May 27, 2023 / 01:06 PM IST

    Samantha- Akkineni Akhil

    Follow us on

    Samantha- Akkineni Akhil: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు దాటుతున్న ఇప్పటికీ కెరీర్ లో సరైన హిట్టు లేని ఏకైక హీరో అక్కినేని అఖిల్. ఆయన తర్వాత వచ్చిన హీరోలు కూడా ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ కొట్టి సత్తా చాటుకున్నారు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటి వరకు బోణీ చెయ్యలేదు. స్టార్ హీరో రేంజ్ ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక ఇలా కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.

    రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తో ఆయన మరో లెవెల్ కి వెళ్తాడు అనుకుంటే, ఇంకా క్రిందకి దిగజారిపోయాడు. అయితే ఈసారి చెయ్యబోయే ప్రాజెక్ట్ కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. ఆయన చెయ్యబోతున్న తదుపరి చిత్రం పేరు ‘ధీర’.

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రం పెట్టుబడి లో పార్టనర్. ఇక ఈ చిత్రం ద్వారా అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. ఈయన గతం లో ప్రభాస్ హీరో గా నటించిన సాహూ మరియు రాధే శ్యామ్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

    అదేమిటంటే ఈ చిత్రం లో అఖిల్ మాజీ వదిన సమంత కూడా నటించబోతున్నట్టు సమాచారం. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అఖిల్ తో స్నేహం గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అందుకే అడగగానే ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఇందులో ఆమె హీరోయిన్ గా నటిస్తుందా, లేదా ఏమైనా ముఖ్య పాత్ర పోషిస్తుందా అనేది చూడాలి.