UPPSC Exam : ఉత్తరప్రదేశ్ నిరుద్యోగులకు ఆ రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 38 అసిస్టెంట్ రిజిస్ర్టార్ పోస్టులకు యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్ 2024 విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ uppsc.up.nic.inలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత గల అభ్యర్థులు బుధవారం(ఆగస్టు 28) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కు చివరి తేదీ సెప్టెంబర్ 28 వరకు చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీ సర్వీసెస్ (సెంట్రల్) సర్వీసెస్ అసిస్టెంట్ రిజిస్ర్టార్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కమిషన్ జారీ చేసిన ప్రకటన నంబర్ ఏ-5/ఈ-1/2024 ప్రకారం ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు అసిస్టెంట్ రిజిస్ర్టార్ మొత్తం 38 పోస్టుల కోసం పరీక్ష నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ కోసం బుధవారం నుంచి సెప్టెంబర్ 28 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. అభ్యర్థులు గడువు వరకు చూడకుండా, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని యూపీపీఎస్సీ అధికార యంత్రాంగం కోరుతున్నది.
యూపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం uppsc.up.nic.inలో దరఖాస్తు చేసుకోవాలి. అంతకుముందు నోటిఫికేషన్ లేదా అడ్వర్టైజింగ్ లో వివరాలు చక్ చేసుకోవాలి. అక్కడ ఉన్న లింక్ ద్వారా వివరణాత్మక నోటిఫికేషన్ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఇక దరఖాస్తు ఫారం కోసం లింక్ ను నొక్కాలి. ఆ లోగా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఆన్ లైన్ లో యూపీపీఎస్సీ నిర్దేశించిన ప్రకారం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫాం నింపాల్సి ఉంటుంది. యూపీపీఎస్సీ ప్రకటించిన అసిస్టెంట్ రిజిస్ర్టార్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ ప్రకారం పూర్తి వివరాలు సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇందుకు గాను అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ లో పూర్తి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. దిని కోసం యూపీపీఎస్సీ అధికార వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఓటీఆర్ లింక్ ఉంటుంది. దీని తర్వాత అభ్యర్థులు కమిషన్ కేటాయించిన ఓటీఆర్ నంబర్ ఆధారంగా సంబంధిత పోస్టులకు నిర్దేశిత గడువులుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 38 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ను యూపీపీఎస్సీ ప్రకటించింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు గడువు వరకు వేచి ఉండొద్దని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని యూపీపీఎస్సీ యంత్రాంగం కోరుతున్నది. ఎలాంటి సాంకేతిక కారణాలు తలెత్తినా కమిషన్ ను సంప్రదించవచ్చని పేర్కొంది. ఇక నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి అర్హత వయస్సు వివరాలను పొందుపర్చింది. ఇక అభ్యర్థులు బుధవారం(ఆగస్టు 28) నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కు చివరి తేదీ సెప్టెంబర్ 28. అభ్యర్థులు ఎలాంటి దళారులను నమ్మవద్దని, నేరుగా కమిషన్ వెబ్ సైట్ లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని, పూర్తి నిఘా ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఇటీవల పలు పోటీ పరీక్షల సందర్భంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో కమిషన్ ఈ సారి కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం వివిధ శాఖల సాయం తీసుకుంటున్నది.