Jabardasth Naresh: జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది.. ఇప్పటికీ ఈ షో ద్వారా చాలా మంది కంటెస్టెంట్లు తమ టాలెంట్ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. అందం, అభినయంతో సంబంధం లేకుండా కేవలం నటనాసక్తి ఉంటే చాలు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిపోతారు అనే విషయాన్ని జబర్దస్త్ నిరూపిస్తోంది. అయితే ఇందులో నటించిన చాలా మంది ఇతర చానెళ్లలో మంచి పొజిషన్లో ఉన్నారు. మరికొందరు సినిమాల్లో నటిస్తే ఫేమస్ అవుతున్నారు. అయితే కొంత మంది కంటెస్టెంట్లు జబర్దస్త్ బిగినింగ్ నుంచి అలాగే కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకరు. మరి ఆయన జబర్దస్త్ లో ఒక్కో షోకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
జబర్దస్త్ షో లో ఉన్న కంటెస్టెంట్లలో నరేష్ ను చూస్తే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆయన చేసే కామెడి చూస్తే కడుపుబ్బా నవ్వేస్తుంది. నరేష్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాడు. కానీ ఆయన యంగ్ కుర్రాడికి ఉన్న వయసు ఉంటుందంటే చాలా మంది నమ్మరు. మొదట్లో నరేష్ జబర్దస్త్ లో చిన్న కంటెస్టెంట్ టా మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు స్పెషల్ ఈవెంట్లలో ఆయన కామెడీతో ఆకట్టుకుంటున్నారు.
హైదరాబాద్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నరేశ్ 2000 జూలై 17న జన్మించారు. వీరి కుటుంబం తన చిన్నప్పుడే పట్టణానికి వచ్చి స్థిరపడింది. నరేష్ తల్లిదండ్రులు ఓ కంపెనీలో పనిచేసేవారు. ఈ క్రమంలో నరేష్ జన్మించారు. అయితే ఈయన పుట్టిన తరువాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆయన జన్మించినప్పుడు కేవలం జానెడు మాత్రమే ఉండేవారట. దీంతో అతను బతకడం కష్టం అని ముందుగా వైద్యులు అనుకున్నారు. కానీ అన్నీ టెస్టులు చేసిన తరువాత బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు.
అయితే కొన్ని కారణాల వల్ల నరేష్ హైట్ పెరగలేకపోయాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన చిన్న చిన్న కామెడీలతో ఆకట్టుకునేవారు. దీంతో జబర్దస్త్ లో సుధాకర్ టీంలో చేరాడు. ఒక రకంగా సుధాకర్ టీంకు గుర్తింపు రావడానికి నరేష్ కారణమని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ లోకి వచ్చాక నరేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక్కో షోకు 3 నుంచి 4 లక్షల రూపాయయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఆయన సంపాదన మొత్తం కోట్ల రూపాయల్లోకి పెరిగింది.