Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ ట్రాక్ లో పడింది. ఒక దశలో ఆఫర్స్ లేక అల్లాడిన ఆమెకు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కాయి. స్టార్ హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సమయంలో శృతి హాసన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. లండన్ ప్రియుడు మైఖేల్ కోర్స్లే కోసం సినిమా చేయడం మానేసింది. దాదాపు రెండేళ్లు శృతి పరిశ్రమకు దూరమైంది. దీంతో ఆడియన్స్, మేకర్స్ ఆమెను మర్చిపోయారు. మైఖేల్ బ్రేకప్ చెప్పడంతో శృతి జీవితంలో అయోమయంలో పడింది. డిప్రెషన్ కి గురైంది. కొన్నాళ్ళు లండన్ లో లైవ్ మ్యూజిక్ షోలు ఇచ్చింది.
ఇండియాకు వచ్చి ఆఫర్స్ వేటలో పడింది. ఆమెకు చిన్న చిన్న సినిమాలు దక్కాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని ఆమెకు రవితేజ పక్కన ఛాన్స్ ఇచ్చాడు. క్రాక్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శ్రుతి హాసన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కింది. క్రాక్ భారీ విజయం సాధించింది. ఆ వెంటనే వకీల్ సాబ్ మూవీలో గెస్ట్ రోల్ పట్టేసింది. వకీల్ సాబ్ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.
గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి మూవీలో మరోసారి శ్రుతి హాసన్ ని తీసుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన విడుదలైన వీరసింహారెడ్డి సూపర్ హిట్ కొట్టింది. ఇక చిరంజీవి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్. అనూహ్యంగా వరుస హిట్స్ తో శృతి ఫోకస్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె సలార్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. తాజాగా ట్రెండీ వేర్లో సరికొత్తగా దర్శనమిచ్చింది. ఆమె లుక్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. కాగా శృతి హాసన్ సహజీవనం చేస్తున్నారు. ముంబైకి చెందిన శాంతను హజారిక ఆమె ప్రస్తుత ప్రియుడు. ముంబైలో ఇద్దరు కాపురం పెట్టారు. మరి ఈ రిలేషన్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
View this post on Instagram