Poorna Marriage: హీరోయిన్ పూర్ణ ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ తో అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. నిశ్చితార్థం చేసుకున్న పూర్ణ పెళ్ళెప్పుడని ఆలోచిస్తుండగా… నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది. మే నెలలో నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ లో షానిద్ అసిఫ్ అలీతో నా వివాహమైంది. దుబాయ్ లో ఈ వేడుక జరగింది. కొన్ని కారణాల వలన వివాహం కేవలం సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఎవరినీ ఆహ్వానించలేదు. అందుకే త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నాము, అని క్లారిటీ ఇచ్చింది.

జూన్ లో వివాహం చేసుకున్న పూర్ణ ఈ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారో అర్థం కాలేదు. దాదాపు ఐదు నెలలుగా ఆమె పెళ్లి కానట్లే ప్రవర్తించారు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి బుల్లితెర షోస్ లో ఎప్పటిలాగే సందడి చేశారు. దీంతో పూర్ణకు వివాహం జరిగిందని ఎవరూ ఊహించలేదు. ప్రకటన తర్వాత పూర్ణ వివాహ వేడుక ఫోటోలు విడుదల చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్ణను వివాహం చేసుకున్న షానిద్ అసిఫ్ అలీ దుబాయ్ లో పెద్ద వ్యాపారవేత్త. ధనవంతుడు కూడాను. భార్య పూర్ణకు ఆయన ఇచ్చిన పెళ్లి కానుకలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. బంగారానికి దుబాయ్ ఫేమస్ కాగా… ఏకంగా 1700 గ్రాముల గోల్డ్ పూర్ణకు పెళ్లి కానుకగా ఇచ్చాడట. అలాగే ఒక లగ్జరీ హౌస్ ఆమె పేరిట రాశారట. కేవలం గోల్డ్ విలువే కోటి రూపాయల వరకూ ఉంటుంది. అంటే ఒక సామాన్యుడు లైఫ్ సెటిల్మెంట్ తో సమానం అన్నమాట. ధనవంతుణ్ణి చేసుకున్న పూర్ణ ఓ రేంజ్ లో సెటిల్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.

ఇక కేరళకు చెందిన పూర్ణ తెలుగులో సీమ టపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్లో హిట్స్ ఉన్నప్పటికీ ఆమె నిలదొక్కుకోలేకపోయారు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. దృశ్యం, అఖండ చిత్రాల్లో పూర్ణ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన తీస్ మార్ ఖాన్ మూవీలో పూర్ణ నటించిన విషయం తెలిసిందే.