Pawan Kalyan- Vadde Naveen: పవన్ కళ్యాణ్ అభిమానుల ఆల్ టైం ఫేవరేట్ చిత్రాల్లో ఖుషి ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. తమిళంలో విజయ్-జ్యోతిక నటించిన ఖుషి చిత్రానికి ఇది అధికారిక రీమేక్. దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అనేక మార్పులు చేసి స్ట్రైట్ మూవీగా తెరకెక్కించారు. వరుస విజయాలతో జోరుమీదున్న పవన్… ఖుషి మూవీతో బాక్సాఫీస్ ని దున్నేశాడు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, భూమిక గ్లామర్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఫుల్ గా వర్కవుట్ అయ్యాయి. మణిశర్మ సంగీతం మరొక హైలెట్. ఖుషి పాటలు యువతను ఊపేశాయి.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిన చిత్రంగా ఖుషి నిలిచింది. కాగా ఈ మూవీ టైటిల్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఖుషి మూవీకి మొదట అనుకున్న టైటిల్ ‘చెప్పాలనివుంది’. దాదాపు కన్ఫర్మ్ అనుకున్న తర్వాత ఎందుకో క్యాచీగా ఉండాలని చెప్పాలనివుంది టైటిల్ పక్కన పెట్టి ఖుషి ని ఎంచుకున్నారు. అది చాలా ప్లస్ అయ్యింది.
ఇక పవన్ కాదనుకున్న చెప్పాలనివుంది టైటిల్ ని వడ్డే నవీన్ వాడుకున్నారు. చంద్ర మహేష్ దర్శకత్వంలో వడ్డే నవీన్, రాశి జంటగా తెరకెక్కిన చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ నెగిటివ్ రోల్ చేసిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. 2001 ఏప్రిల్ నెలలో ఖుషి విడుదల కాగా… వడ్డే నవీన్ నటించిన చెప్పాలనివుంది అదే ఏడాది ఆగస్టు నెలలో విడుదలైంది. వడ్డే నవీన్ కి చెప్పాలనివుంది టైటిల్ కలిసి రాలేదు. ఒకవేళ పవన్ ఆ టైటిల్ వాడుకొని ఉంటే సెంటిమెంట్ దెబ్బేసేదా అనే ఒక వాదన ఉంది.

ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులు ఖుషి అయ్యారు. బ్లాక్ బస్టర్ విజయంతో పండగ చేసుకున్నారు. ఖుషి హ్యాంగోవర్ యవతను చాలా కాలం వెంటాడింది. మణిశర్మ పాటలు ప్రతిచోటా వినిపించేవి. పవన్ సినిమాల కోసం పిచ్చిగా ఎదురుచూసేలా ఖుషి చేసింది. అయితే పవన్ మాత్రం ఖుషి తర్వాత రెండేళ్ల గ్యాప్ ఇచ్చాడు.చాలా నిరీక్షణ తర్వాత 2003లో విడుదలైన జానీ నిరాశపరిచింది.